nagidream
Zomato Delivery Partner Refused 500 Rupees Reward From Woman And Sacrifised To Another Delivery Partner: ఇలాంటి మంచి మనుషులని చూసినప్పుడు మనసు మంచు కొండలా మారిపోతుంది. హృదయం పులకించిపోతుంది. ఎంత మంచి మనసో ఈ వ్యక్తిది. తనకు వచ్చిన బహుమతిని వేరొక వ్యక్తికి త్యాగం చేశారు. సెల్యూట్..
Zomato Delivery Partner Refused 500 Rupees Reward From Woman And Sacrifised To Another Delivery Partner: ఇలాంటి మంచి మనుషులని చూసినప్పుడు మనసు మంచు కొండలా మారిపోతుంది. హృదయం పులకించిపోతుంది. ఎంత మంచి మనసో ఈ వ్యక్తిది. తనకు వచ్చిన బహుమతిని వేరొక వ్యక్తికి త్యాగం చేశారు. సెల్యూట్..
nagidream
కలికాలంలో ధర్మం మూడు పాదాల మీదనే నడుస్తుంది. కాబట్టి పాపం పెరిగిపోతుందని ఎప్పుడో చెప్పారు. అయినప్పటికీ ఈ భూమి ఇంకా ఇలా సజీవంగా ఉందంటే దానికి కారణం మంచి మనుషులు, మంచి మనసులు. ఈరోజుల్లో ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించే మనుషులే అరుదైపోయారు. అలాంటిది ఇంత ఇరుకైన సమాజంలో విశాలమైన మనసున్న మనుషులు ఉండడం.. పక్కనోళ్ళ గురించి ఆలోచించడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా బతుకు భారమైన స్థితిలో ఉండి వేరే వాళ్లకు త్యాగం, సాయం చేయడం అంటే చిన్న విషయం కాదు. మనసున్న మారాజు అయితే తప్ప ఇలాంటి ఆలోచన రాదు. తాజాగా ఓ స్విగ్గీ డెలివరీ ఏజెంట్ విషయంలో ఇదే రుజువైంది.
ఒక యువతి స్విగ్గీ, జొమాటో యాప్స్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. అయితే ఎవరు ముందుగా ఆర్డర్ డెలివరీ చేస్తే వారికి 500 రూపాయల రివార్డ్ ఇవ్వాలని అనుకున్నారు. అయితే స్విగ్గీ ఏజెంట్ కంటే ముందు జొమాటో డెలివరీ పర్సన్ వచ్చారు. దీంతో ఆ యువతి 500 రూపాయల రివార్డ్ ని జొమాటో వ్యక్తికి ఇవ్వాలని అనుకున్నారు. కానీ జొమాటో పర్సన్ తనకు వద్దని.. స్విగ్గీ పర్సన్ కి ఇవ్వాల్సిందిగా పట్టుబట్టారు.
‘మీ ఇద్దరిలో ఎవరు ముందు వస్తే వారికి 500 రూపాయలు ఇవ్వాలని అనుకున్నాం. అయితే ఇద్దరూ ఏకకాలంలోనే వచ్చారు. కానీ మీరు (జొమాటో పర్సన్ ని ఉద్దేశించి) ఆయన (స్విగ్గీ పర్సన్) కంటే అర నిమిషం ముందు వచ్చారు. మీరు నాకు ఫస్ట్ కాల్ చేశారు. అందుకే మీకు 500 రూపాయల రివార్డ్ ఇవ్వాలని అనుకుంటున్నా’ అని ఆ యువతి అన్నారు. దానికి ఆ జొమాటో డెలివరీ పర్సన్.. తన వెనుక ఉన్న స్విగ్గీ పర్సన్ కి ఇవ్వండి. నా ఆర్డర్ లొకేషన్ దగ్గరలో ఉండి ఉండవచ్చు. అందుకే నేను ముందుగా వచ్చానేమో. అతని లొకేషన్ దూరం అయి ఉండవచ్చు’ అని జొమాటో పర్సన్ అన్నారు. దానికి ఆ యువతి.. మీరే కదా ముందు వచ్చారు మీకే ఇస్తాను అని అన్నారు.
దానికి జొమాటో పర్సన్ మాట్లాడుతూ.. నేను బ్యాచిలర్ ని. స్విగ్గీ పర్సన్ ఫ్యామిలీ పర్సన్ అయి ఉండచ్చు. కాబట్టి అతనికే ఇవ్వండి’ అని అన్నారు. దానికి ఆ యువతి.. జొమాటో పర్సన్ కోరుకున్నట్టుగానే స్విగ్గీ పర్సన్ కి 500 రూపాయలు ఇచ్చారు. తీసుకో బ్రో అంటూ జొమాటో పర్సన్ స్విగ్గీ పర్సన్ తో అన్నారు. దీంతో ఆ యువతి స్విగ్గీ పర్సన్ కి ఆ 5 వందల రూపాయల రివార్డ్ ఇచ్చారు. చాలా మంది స్విగ్గీ, జొమాటో డెలివరీ పర్సన్స్ గా చేరేది ఫ్యామిలీ కోసమే. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలనే జాయిన్ అవుతారు.
అందులో బ్యాచిలర్స్ ఉంటారు. ఫ్యామిలీ పర్సన్స్ ఉంటారు. బాగా పేదవాళ్ళు ఉంటారు. దిగువ, ఎగువ మధ్యతరగతి వాళ్ళు కూడా ఉంటారు. ఈ మధ్యన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా చేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు.. డబ్బు అంటే ఎంత ప్రాముఖ్యతో అనే విషయం. కానీ ఈ జొమాటో పర్సన్ మాత్రం.. తనకొచ్చిన డబ్బుని కూడా వేరొకరి కోసం త్యాగం చేశారు. కొంతమందికి ఈ డబ్బులు తక్కువే కావచ్చు కానీ వారికి అది ఎక్కువే. ఇక్కడ డబ్బు కంటే త్యాగం విలువైనది. మరి మీరేమంటారు? ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంచి మనసున్న ఈ వ్యక్తి ఎంతోమంది మనసు గెలుచుకున్నారు. సెల్యూట్ బ్రదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
I’m a bachelor, he might be a family man. ❤️ pic.twitter.com/f1nvii8Bha
— Jigar Punadiya (@Jigspunadiya) July 27, 2024