iDreamPost
android-app
ios-app

కొన్ని రోజుల్లో పెళ్లి.. కానీ ఇంతలోనే ఘోరం.. అసలు ఏం జరిగిందంటే?

యూపీకి చెందిన యువ కానిస్టేబుల్ విధుల్లో చురుకుగా ఉంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

యూపీకి చెందిన యువ కానిస్టేబుల్ విధుల్లో చురుకుగా ఉంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

కొన్ని రోజుల్లో పెళ్లి.. కానీ ఇంతలోనే ఘోరం.. అసలు ఏం జరిగిందంటే?

దేశంలోని యువత పోలీస్, ఆర్మీ ఉద్యోగాల పట్ల ఆకర్షితులవుతుంటారు. దేశం, సమాజ రక్షణ కోసం తమ వంతు కృషి చేసేందుకు పోలీస్ ఉద్యోగాలను సాధించాలని యువత కలలు కంటుంటారు. ఇదే విధంగా ఓ యువకుడు తను కన్న కలల్ని నిజం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాడు. చివరికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాడు. పోలీస్ విధుల్లో ఆక్టీవ్ గా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ఆ యంగ్ కానిస్టేబుల్. ఇక మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు మునిగిపోయారు. కుటుంబమంతా సంతోషం సంతరించుకున్న వేళ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. అసలు ఏం జరిగిందంటే?

పోలీస్ ఉద్యోగమంటే నిత్యం ప్రాణాలతో చెలగాటమే. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెడతారు పోలీసులు. దుండగులు, ఉగ్రవాదులు ఎప్పుడు ఎలా దాడులు చేస్తారో ఊహించలేము. ఆ దాడుల్లో సామాన్య ప్రజల ప్రాణాలను రక్షించే క్రమంలో పోలీస్ అధికారులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటారు. ఇదే విధంగా ఆ యువ పోలీస్ కానిస్టేబుల్ ఓ కరుడుగట్టిన క్రిమినల్ ను పట్టుకునే క్రమంలో జరిగిన ఎనౌకౌంటర్ లో ప్రాణాలను కోల్పోయాడు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన పెళ్లి పీటలెక్కబోతుండగా ఇలా విధినిర్వహణలో కానిస్టేబుల్ అసువులు బాయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. ఈ విషాద ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

police dead

యూపీలో గత కొంత కాలం నుంచి నేరస్తులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. సీఎం ఆదిత్యనాథ్ నేతృత్వంలోని సర్కార్ క్రిమినల్స్ ను ఏరివేస్తూ నేరం చేయాలంటేనే వణికిపోయేలా చర్యలు చేపడుతోంది. పూర్తి స్థాయిలో నేరస్థులను ఏరివేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కన్నౌజ్ జిల్లలో అశోక్ యాదవ్ అనే కరుడుగట్టిన నేరస్థుడు ఉన్నాడు. అతడిపై ఇప్పటి వరకు 20కి పైగా క్రిమినల్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో ఓ హత్య కేసులో అశోక్ యాదవ్ ను అరెస్టు చేసేందుకు పోలీసు అధికారులు అతని ఇంటికి వెళ్లారు. పోలీసుల‌ను గ‌మ‌నించిన అశోక్, అత‌ని కుమారుడు అభ‌య్ క‌లిసి కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో స‌చిన్ రాథీ అనే యువ కానిస్టేబుల్ కు బుల్లెట్ గాయ‌మైంది. వెంటనే గాయ‌ప‌డ్డ కానిస్టేబుల్ స‌చిన్ రాథీని కాన్పూర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

కాగా నేరస్థుడు కాల్పులు జరుపుతుండడంతో మరింత మంది పోలీసులను అక్కడికి పంపించింది పోలీస్ డిపార్ట్ మెంట్. నేరస్థుడు అశోక్ యాదవ్, పోలీసులకు మధ్య దాదాపు గంటన్నరపాటు కాల్పులు జరిగాయి. చివరాఖరికి ఆ నేరస్థుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిమినల్ ను పట్టుకునే క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడ్డ కానిస్టేబుల్ స‌చిన్ రాథీ ఆరోగ్యం విషమించింది. తీవ్ర ర‌క్త‌స్రావం జ‌ర‌గ‌డంతో నిన్న అర్ధ‌రాత్రి స‌చిన్ తుది శ్వాస విడిచారు. కాగా స‌చిన్ రాథీ ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్‌కు చెందిన యువ‌కుడు. 2019లో పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. క్రిమినల్ ను పట్టుకునేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మరి విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన యంగ్ కానిస్టేబుల్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి