West Bengal: వీడియో: మహిళను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా...

వీడియో: మహిళను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా…

West Bengal: నడివీధిలో ఓ మహిళతో సహ ఇద్దర్ని ఓ వ్యక్తి విచక్షణారహితంగా కొడుతుంటే.. చుట్టూ ఉన్న జనం చోద్యం చూస్తున్నారు. అత్యంత అమానుష జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

West Bengal: నడివీధిలో ఓ మహిళతో సహ ఇద్దర్ని ఓ వ్యక్తి విచక్షణారహితంగా కొడుతుంటే.. చుట్టూ ఉన్న జనం చోద్యం చూస్తున్నారు. అత్యంత అమానుష జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మధ్యకాలంలో కొన్ని అమానుష ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళ విషయంలో కీచక పర్వాలు జరుగుతున్నాయి. బస్సుల్లో, ఆటోల్లో, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో ఆడవారిపై దాడులు జరుగుతున్నాయి. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఏదో ఒక ప్రాంతంలో దాడులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం ఓ మహిళను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కిడ్నాప్ చేశారు. తాజాగా ఓ లేడీని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దారుణానికి ఒడిగట్టారు. విచక్షణ రహితంగా ఆ మహిళను కొట్టారు.  ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వెస్ట్ బెంగాల్ లో కీచక పర్వం చోటుచేసుకుంది. నడివీధిలో ఓ మహిళతో సహ ఇద్దరు వ్యక్తులను ఓ వ్యక్తి విచక్షణ రహితంగా కొట్టాడు. అలా మహిళపై దాడి చేస్తున్న సమయంలో అందరూ చోద్యం చూస్తున్నారే తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ అమానుష ఘటన బెంగాల్ లోని ఉత్తర రినాజ్‌పూర్ జిల్లా చోప్రాకిలో జరిగినట్టు ప్రతిపక్ష బీజేపీ, సీపీఎం నేతలు పేర్కొన్నారు. ఇక ఆ వ్యక్తి దాడిలో దెబ్బలకు తాళలేక బాధితురాలు పెద్ద పెట్టున రోదనలు చేసింది. అయినా ఆమెను కాపాడేందుకు ఎవరు ముందుకు రాలేదు. పైగా సినిమా చూసినట్లు ఆమెను కొడుతుంటే చూస్తూ ఉండిపోయారు. ఇక మహిళతో పాటు మరో వ్యక్తిపై దాడి చేయడం వీడియోలో కనిపిస్తోంది. ఆ బాధితురాలిని జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి..కడుపులో కాలితో తన్నాడు.

అంతేకాక ఒక కట్టే తీసుకుని ఆ మహిళ, మరో వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఇక ఈ  దాడికి పాల్పడిన నిందితుడి తజేముల్ అని తేలింది. అతడికి అధికార టీఎంసీ పార్టీతో సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, మహిళతో సహ మరో వ్యక్తిని ఎందుకు అంత దారుణంగా కొట్టారుఅనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్  కావడంతో పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనపై అధికార టీఎంసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బెంగాల్‌లో మమతా బెనర్జీ దుర్మార్గపు పాలన నడుస్తోందని బీజేపీ విమర్శలు  చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments