డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ కొంప ముంచిన భార్య ఫోన్ కాల్.. రైల్వేకు 3 కోట్ల నష్టం!

Visakhapatnam: ఒక్క ఫోన్ కాల్ ద్వారా వివాహ జీవితమే పోయింది. ఈ సంఘటన విశాఖ పట్నంలో జరిగింది.

Visakhapatnam: ఒక్క ఫోన్ కాల్ ద్వారా వివాహ జీవితమే పోయింది. ఈ సంఘటన విశాఖ పట్నంలో జరిగింది.

విశాఖ పట్నంలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. దీని గురించి తెలిస్తే వామ్మో అంటారు. వైజాగ్ రైల్వే స్టేషన్ లో పని చేసే స్టేషన్ మాస్టర్‌కు.. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు చెందిన మహిళతో 2011 అక్టోబర్ 12న పెళ్లి జరిగింది. అయితే పెళ్లికి ముందే ఆమెకు మరొకరితో సంబంధం ఉంది.. దాంతో ఇతనితో పెళ్లి ఆమెకు ఇష్టం లేదు. అందువల్ల ఈ భార్యాభర్తల మధ్య ప్రతి రోజూ గొడవలు జరిగేవి. భార్య ప్రవర్తన స్టేషన్ మాస్టర్ కి అసలు నచ్చేది కాదు.. ఈ విషయం తన అత్తామామలకు కూడా చెప్పాడు.. సర్దుకుపో బాబు, తను మారుతుందిలే అని వారు ఆయనకి నచ్చజెప్పారు. కానీ అప్పటికీ కూడా ఆమె ప్రవర్తన మారలేదు. పైగా భర్త మంచం మీద తన పక్కన ఉన్న సమయంలోనే ఆమె రెచ్చిపోయేది. ఏం చేసేదో తెలుసా? తన ప్రియుడికి ఫోన్ చేసి మాట్లాడేది. ఆమె ఇలాంటి పనులు చేయబట్టే వారి మధ్య గొడవలు జరిగేవి. చివరకు వీరి వివాహ బంధం చాలా క్రిటికల్ గా మారింది.

ఇక ఇదిలా ఉండగా.. ఓ రోజు రాత్రి ఈ స్టేషన్ మాస్టర్ డ్యూటీలో ఉన్నాడు. ఆ టైమ్ లో అతడి భార్య కాల్ చేసింది. ఫోన్లో కూడా ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ జరిగింది. పనిలో ఉన్న స్టేషన్ మాస్టర్ ఇంట్లో మాట్లాడుకుందాం.. అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అయితే భార్యతో మాట్లాడుతునప్పుడు తన మైక్రోఫోన్ ఆన్‌లో ఉన్న సంగతి ఆ స్టేషన్ మాస్టర్ మర్చిపోయారు. ఇక్కడే పెద్ద నష్టం జరిగింది. స్టేషన్ మాస్టర్ నోటి నుంచి వచ్చిన ఓకే అనే మాటను మైక్రో ఫోన్ ద్వారా విన్న ఆయన కొలీగ్.. గూడ్స్ రైలు వెళ్లేందుక అనుమతి ఇచ్చారని అనుకున్నాడు. దాంతో అది వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ స్టేషన్ మాస్టర్ దరిద్రం ఏంటంటే.. ఆయన మాట్లాడిన మాటల్లో ఆ ఓకే అనే మాట మాత్రమే అవతలి వ్యక్తికి వినపడింది. పైగా అది మామూలు ప్లేస్ కాదు. మావోయిస్ట్ లు ఉండే ప్లేస్.. అందుకే రాత్రి వేళల్లో ఆ ప్రాంతంలో రైళ్ల రాకపోకలు నిషిద్ధం. కానీ స్టేషన్ మాస్టర్ ‘ఓకే’ చెప్పడంతో.. ఆ రైలు ముందుకెళ్లింది. లక్కీగా దానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ఇది రాత్రి నిబంధనలకు విరుద్ధం కావడంతో.. రైల్వేకు ఏకంగా రూ.3 కోట్ల నష్టం జరిగింది. ఇంత నష్టం జరిగాక అధికారులు ఊరుకుంటారా.. దీనికి కారణమైన ఆ స్టేషన్ మాస్టర్‌ను సస్పెండ్ చేశారు. పాపం స్టేషన్ మాస్టర్ పరిస్థితి మరీ దారుణం అయ్యింది.ఆయన దాంపత్య జీవితం మరింత చిక్కుల్లో పడింది. అప్పటికే భార్య తీరుతో విసిగిపోయి ఉన్నాడు ఆ స్టేషన్ మాస్టర్.. దానికి తోడు సస్పెండ్ కావడంతో ఇంకా మనో వేదనకు గురయ్యాడు. దీంతో విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టులో విడాకులకు పిటిషన్ వేశాడు.

అప్పుడు స్టేషన్ మాస్టర్‌పైన ఆయన భార్య ఇంకా రెచ్చిపోయింది. అతనిపై ఏకంగా సెక్షన్ 498 ఎ కింద వేధింపుల కేసు పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన తన బావను, 70 ఏళ్ల మామను, ఆడపడుచును కూడా ఈ కేసులో ఆమె ఇరికించింది. భర్త, అతని కుటుంబ సభ్యుల వల్ల తన ప్రాణాలకే ప్రమాదం ఉందని ఆరోపించింది. ఏకంగా సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ.. విడాకుల కేసును విశాఖపట్నం నుంచి దుర్గ్‌కు మార్పించుకుంది. దుర్గ్ ఫ్యామిలీ కోర్టు ఆ స్టేషన్ మాస్టర్ విడాకుల పిటిషన్‌ను రద్దు చేసింది. ఆయన మళ్ళీ తగ్గలేదు. ఈసారి ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకి వెళ్లారు. చాలా కాలం పాటు ఈ వ్యవహారం కోర్టులో నడిచింది. ఇక జస్టిస్ రజని దూబే, జస్టిస్ సంజయ్ కుమార్ జైశ్వాల్‌తో కూడిన న్యాయస్థానం ఈ కేసులో అంతిమ తీర్పుని ఇచ్చింది. స్టేషన్ మాస్టర్ భార్యే చాలా క్రూరంగా ప్రవర్తించిందని కోర్టు అభిప్రాయపడింది. ఫ్యామిలీ కోర్టు తీర్పును రివర్స్ చేసింది. చివరకు ఆయనకి విడాకులని మంజూరు చేసింది. తన భర్తకు వదినతో అక్రమ సంబంధం ఉందంటూ.. స్టేషన్ మాస్టర్‌ భార్య ఆరోపణలు కూడా చేసింది. అయితే అవి తప్పుడు ఆరోపణలని కోర్టు గుర్తించింది. అంతేగాక ఆమె వరకట్నం, వేధింపుల ఆరోపణలు కూడా తప్పని తేల్చింది. ఎందుకంటే వీటికి ఆమె తగిన ఆధారాలను సమర్పించలేకపోయింది. భర్త కుటుంబ సభ్యులు వారితో కలిసి ఉండటం లేదు కాబట్టి.. వారిపైనా ఆమె చేసిన ఆరోపణలు తప్పుడివి అని తేలింది. దీంతో వాటిని కోర్టు కొట్టివేసింది. భార్య తనతో ఫోన్‌లో గొడవ పెట్టుకోవడం వల్లనే అతని సస్పెన్షన్ జరిగిందని తేలింది. అతనిపై లేని పోనీ ఆరోపణలు చేయడం.. ఇవన్నీ కూడా మానసిక క్రూరత్వమేనని కోర్టు తెలిపింది. దీంతో ఆ స్టేషన్ మాస్టర్‌కు విడాకులు మంజూరు చేసింది. ఇదీ సంగతి. విన్న మనకే అయ్యో పాపం అనిపిస్తే .. ఇదంతా అనుభవించిన ఆ స్టేషన్ మాస్టర్ కి ఇంకెంత వేదన ఉంటుందో అర్ధం చేసుకోండి. ఇక ఈ ఘటన గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments