ఇప్పుడు అందరి జీవితాలు ఉరుకుల పరుగులమయంగా మారిపోయాయి. పొద్దున లేస్తే చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ అందరూ బిజీబిజీగా అయిపోతున్నారు. పనిభారం ఎక్కువగా అయిపోయిన ఈ కాలంలో సమయపాలన చాలా ముఖ్యమనే చెప్పాలి. ఏ పనైనా టైమ్‌కు చేయాలి లేకపోతే ఇబ్బందులు తప్పవు. సమయపాలన సరిగా లేకపోవడం, ఆధునిక జీవనశైలి వల్ల చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. నిర్ణీత సమయానికి ముందే అనుకున్న పనులను పూర్తి చేస్తే ఎలాంటి ఒత్తిడి ఉండదు. సమయపాలనను పిల్లలకు కూడా అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏ పనిని ఆ టైమ్‌కు చేయకపోవడం వల్ల అన్ని పనులూ ఒకేసారి తల మీద పడతాయి. సమయపాలనను ఇంట్లోని పెద్దవారు పిల్లలకు అలవాటు చేయాలి. ప్రజలే కాదు.. ప్రభుత్వ అధికారులు, అధికారంలో ఉన్న నేతలు కూడా సమయపాలనను సరిగ్గా పాటించాలి. అప్పుడే వారిని చూసి అందరిలోనూ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే అభాసుపాలు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడో మంత్రి పరిస్థితి అలాగే ఉంది. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ పైకి ఓ మంత్రి తన కారుతో దూసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి ధరమ్‌పాల్ సింగ్ సైసీ బరేలీకి వెళ్లాల్సి ఉంది.
హౌరా-అమృత్సర్ ఎక్స్‌ప్రెస్‌లో బరేలీకి వెళ్లాలని మంత్రి ధరమ్‌పాల్ నిర్ణయించుకున్నారు. కానీ ట్రైన్ వెళ్లే టైమ్‌కు ఆయన స్టేషన్‌కు చేరుకోలేకపోయారు. దీంతో ఎక్కడ రైలు మిస్సవుతుందోనని స్టేషన్‌కు హడావుడిగా వచ్చారు. ఈ క్రమంలో స్టేషన్ ఎంట్రన్స్ దగ్గర కారును పార్క్ చేయాల్సిన ఆయన ఆపకుండా లోపలకు వెళ్లారు. అంతేగాక దివ్యాంగుల కోసం వాడే వీల్‌చైర్ ర్యాంప్ పైకి తన కారును ఎక్కించి ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్నారు మంత్రి ధరమ్‌పాల్. దీంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మంత్రి అయినంత మాత్రాన స్టేషన్లోకి ఇలా వస్తారా? ఇది అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని ప్యాసింజర్లు ఆయనపై సీరియస్ అవుతున్నారు. ప్లాట్‌ఫామ్‌పై నడుచుకుంటూ వెళ్తే ఆయన సొమ్మేం పోతుందని విమర్శిస్తున్నారు.
पशुधन मंत्री धर्मपाल सिंह जी के विधानसभा क्षेत्र आंवला में आवारा पशुओं से तंग आ चुके किसानों ने उनकी गाड़ी के आगे ही आवारा पशुओं को खड़ा कर दिया और कहा, ‘इन्हें ले जाइए!’
मंत्री जी अपनी ही विधानसभा की जनता के आगे बेबस दिखे। वैसे, जनता ने इनका इलाज़ ठीक ही किया।
पशुओं का धन… pic.twitter.com/FZAg9KFynO
— UP Congress (@INCUttarPradesh) August 18, 2023
वाह मंत्री जी वाह, स्टेशन के अंदर प्लेटफार्म तक पहुंचा दी आपने अपनी कार। मंत्री जी उत्तरप्रदेश में पशुधन मंत्री हैं, नाम है धर्मपाल सिंह सैनी। इनको कहीं जाना था, लेट हो रहे थे, इसलिए सीधे अपनी कार को रैंप पर चढ़ाते हुए स्टेशन के प्लेटफार्म नंबर 1 तक पहुंचा दिया। यहीं कोई और होता… pic.twitter.com/2jzZbSduBT
— Aviral Singh (@aviralsingh15) August 24, 2023