UP-12 Hrs Free Electricity To Farmers: రైతులకు మరో వరం.. ఇకపై 12 గంటలు ఉచిత కరెంట్‌

Free Electricity: రైతులకు మరో వరం.. ఇకపై 12 గంటలు ఉచిత కరెంట్‌

UP-12 Hours Free Electricity: ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి 12 గంటల పాటు ఉచిత కరెంట్‌ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

UP-12 Hours Free Electricity: ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి 12 గంటల పాటు ఉచిత కరెంట్‌ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

అన్నదాతల సంక్షేమ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసేందే. వారికి పెట్టుబడి సాయం, రుణమాఫీ, కనీస మద్దతు ధర కల్పించడంతో పాటుగా.. ఎరువులు మీద సబ్సిడీ కూడా అందిస్తున్నాయి. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అన్నదాతల సంక్షేమం కోసం.. ఎన్నో పథకాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. పెట్టుబడి సాయంతో పాటుగా.. రైతు రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ అందిస్తూ.. అన్నదాతల సంక్షేమం కోసం కృషి చేస్తోంది. ఈ క్రమంలో తజాఆగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతలుకు 12 గంటల పాటు ఉచిత కరెంట్‌ అందించేందుకు ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

తెలంగాణలో ఇప్పటికే వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంట్‌ అందిస్తున్నారు. 24 గంటల పాటు ఫ్రీ కరెంట్‌ అందించే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు క్రియేట్‌ చేయగా.. తాజాగా మరో రాష్ట్రం వ్యవసాయానికి 12 గంటల పాటు ఉచిత కరెంట్‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అన్నదాతల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి 12 గంటల పాటు ఉచిత కరెంట్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. రైతులపై విద్యుత్‌ భారాన్ని తగ్గించేందుకు యూపీ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్‌ కింద రైతులకు ప్రతిరోజూ 12 గంటల ఉచిత విద్యుత్‌ను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది.

రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌

జిల్లా వ్యాప్తంగా 18 గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. మొదట్లో ఆగస్టు 5 నుంచి ఆగస్టు 10 వరకు రిజిస్ట్రేషన్ జరుగుతుందని ప్రకటించారు. అయితే తాజాగా ఈ గడువును ఆగస్టు 16 వరకు పొడిగించారు. ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి రైతులు సులభంగా రిజిస్టర్‌ చేసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇందుకు సంబంధించి వివిధ గ్రామాల్లో వేర్వేరు తేదీల్లో రిజిస్ట్రేషన్‌ క్యాంపెయిన్స్‌ నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ మోటారు కనెక్షన్‌ ఉన్న రైతులకు ప్రయోజనం చేకూర్చడమే ఈ శిబిరాల లక్ష్యం అని, సాధారణ ప్రజలు విద్యుత్ బిల్లులు బకాయిలు చెల్లించి.. ఈ ఉచిత విద్యుత్ పథకానికి నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Show comments