ఇది కదా సక్సెస్‌ అంటే.. 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు

విజయం అంటే గొప్ప గొప్ప ఆశిష్కరణలు చేయడం కాదు.. రోజు చేసే పని అయినా.. మిగతా వారికి భిన్నంగా.. కొత్తగా.. సౌకర్యవంతంగా.. మరింత లాభాలు వచ్చేదిగా చేస్తే చాలు. తాజాగా ఓ రైతు కూడా ఇదే పద్దతి ఫాలో అయ్యి..భారీ లాభాలు ఆర్జించాడు. ఆ వివరాలు..

విజయం అంటే గొప్ప గొప్ప ఆశిష్కరణలు చేయడం కాదు.. రోజు చేసే పని అయినా.. మిగతా వారికి భిన్నంగా.. కొత్తగా.. సౌకర్యవంతంగా.. మరింత లాభాలు వచ్చేదిగా చేస్తే చాలు. తాజాగా ఓ రైతు కూడా ఇదే పద్దతి ఫాలో అయ్యి..భారీ లాభాలు ఆర్జించాడు. ఆ వివరాలు..

సక్సెస్‌ సాధించాలంటే.. పెద్ద పెద్ద యూనివర్శిటీలల్లో గొప్ప గొప్ప చదువులు చదవడం కాదు.. మన చుట్టూ ఉన్న సమస్యలకు మేలైన, చౌకైన పరిష్కారం చూపే వారే అసలుసిసలు విజేతలు. వారికి గొప్ప గొప్ప డిగ్రీలేం ఉండవు. చాలా మందికి కనీస అక్షర పరిజ్ఞానం కూడా లేని వారు ఉంటారు. అయినా సరే వారు సాధించిన విజయాలు గొప్ప శాస్త్రవేత్తల ఆవిష్కరణల కన్నా తక్కువేం కాదు. ఇక తాజాగా ఓ రైతు ఇదే మాదిరి భారీ విజయాన్ని సాధించాడు. ఓ చిన్న ఆలోచనతో కేవలం నాలుగు నెలల వ్యవధిలో 3 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడు. ఆ వివరాలు..

సాధారణంగా వ్యవసాయం అనగానే చాలా మంది రైతులు సంప్రాదాయ పద్దతిలో వెళ్తుంటారు. ప్రతి ఏటా అవే పంటలు వేస్తూ.. సరైన దిగుబడి లేక నష్టాల పాలవుతుంటారు. అలా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచిస్తే లాభాలు వారి సొంతమవుతాయి. వర్షపాతం, మార్కెట్‌ డిమాండ్‌, సీజన్‌ల వారీగా ఆలోచించి పంటలు సాగు చేస్తే.. భారీగా లాభాలు కళ్ల చూస్తారు. ఇప్పుడు మనం చెప్పుకొబోయే రైతు కూడా ఇలానే ఆలోచించాడు. అందుకు రిజల్ట్‌.. కేవలం నాలుగు నెలల వ్యవధిలో 3 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇంతకు ఆ రైతు చేసిన ఆలోచన ఏంటి అంటే..

వేసవి కాలం ఖర్బూజ, పుచ్చకాయలకు డిమాండ్‌ బాగుంటుంది. వాటిని సాగు చేస్తే.. రైతన్నలకు లాభాలు వస్తాయి. ఇదే ఆలోచనను ఆచరణలో పెట్టాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ రైతు. రెండేళ్లుగా ఖర్బూజ సాగుచేసి చరిత్ర సృష్టించాడు. తక్కువ సమయంలో అంటే నాలుగు నెలల్లో రూ. 3 కోట్లు సంపాదించాడు. యూపీ,​ షాజహాన్‌పూర్‌, పువాయాన్ తహసీల్‌కు చెందిన ప్రగతిశీలకు చెందిన యువ రైతు దీపక్ తాను నివసించే ప్రాంతంలో ఖాళీగా ఉన్న భూములను ఎకరాకు రూ.25-30 వేల చొప్పున చెల్లించి కౌలుకు తీసుకున్నాడు. వేసవి కాలంలో బాగా డిమాండ్​ ఉన్న ఖర్బూజా పంటను సాగు చేశాడు. దీనితో పాటు పుచ్చకాయ పంటను కూడా పండించి​ కోటీశ్వరుడయ్యాడు.

రైతుల వద్ద నుంచి 4 నెలల కాలానికి భూమిని లీజుకు తీసుకున్నాడు దీపక్‌. గత రెండేళ్ల నుంచి పుచ్చ, ఖర్బూజ సాగు చేస్తున్నాడు. మొదట్లో 10 ఎకరాల్లో పండించిన దీపక్​.. ఇప్పుడు 356 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆ ప్రాంతంలో రైతులు ఎక్కువుగా బంగాళదుంప పంటను సాగు చేస్తారు. ఈ పంటను కోసిన తరువాత.. రైతుల పొలాలు ఖాళీగా ఉండటంతో 4 నెలల పాటు లీజుకు తీసుకొని పుచ్చ, ఖర్బూజా పంటలను సాగు చేశాడు. దీని కోసం దీపక్‌.. థాయ్‌లాండ్‌, తైవాన్‌ నుంచి నాణ్యమైన విత్తనాలు సేకరించి.. వాటిని పొలాల్లో నాటాడు. వీటి ధర కిలోకు రూ.30-90 వేలు ఉంటుంది. వితనం ఖరీదు ఎక్కువైనప్పటికి.. పంట దిగుబడి అధికంగా వచ్చింది. ఖర్బూజ పంట అయితే ఎకరానికి 150-200 క్వింటాళ్లు దిగబడి వచ్చింది.

దీపక్​ ఉత్తరప్రదేశ్​లోని 40-50 మండీలకు .. ఉత్తరాఖండ్‌లోని 20 మండీలకు … బిహార్‌లోని అనేక జిల్లాలకు ఖర్బూజ పంటను సరఫరా చేశాడు. కొంతమంది పండ్ల వ్యాపారులు నేరుగా దీపక్​ ను సంప్రదించి ఆర్డర్​ ఇచ్చేవారని యువరైతు దీపక్​ తెలిపారు. ఖర్బూజా, పుచ్చకాయ పంటను సాగు చేసిన దీపక్​ ఒక్క సీజన్‌లోనే రూ. 3 కోట్లు సంపాదించాడు. అంతేకాదు ఆయన ఈ నాలుగు నెలల పాటు సుమారు 400-500 మందికి ఉపాధి కల్పించాడు. వేసవిలో ఖర్బూజ, పుచ్చకాయలు మార్కెట్లో చాలా సులభంగా అమ్ముడవుతున్నాయి. వేసవిలో ఇలాంటి పంటలను పండిస్తే మంచి ఆదాయం సంపాదించవచ్చని అంటున్నారు.

Show comments