Vinay Kola
Chennai: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెన్నై మెరీనా బీచ్ లో ఆదివారం నిర్వహించిన విన్యాసాల ప్రదర్శనలో తీవ్ర విషాదం జరిగింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.
Chennai: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెన్నై మెరీనా బీచ్ లో ఆదివారం నిర్వహించిన విన్యాసాల ప్రదర్శనలో తీవ్ర విషాదం జరిగింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.
Vinay Kola
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెన్నై మెరీనా బీచ్ లో ఆదివారం నిర్వహించిన విన్యాసాలు కన్నుల పండుగలా సాగాయి. ఈ ప్రదర్శన చూడటానికి సుమారు 15 లక్షల మందికిపైగా జనం వచ్చారు. దీంతో ఈ ప్రదర్శన ప్రపంచ రికార్డు సృష్టించింది. ఏకంగా ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకుంది. ఆదివారం 11 గంటలకు ప్రారంభమైన ఈ విన్యాసాలు రెండు గంటలపాటు జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఎం17 రకానికి చెందిన రెండు హెలికాప్టర్లు మెరుపువేగంతో ఆకాశంలో చక్కర్లు కొట్టడం కనుల విందుగా నిలిచింది.ఆకాశ్‌గంగా టీం మెంబర్స్ ఉగ్రవాదుల నుంచి బందీలను విడిపించే విన్యాసాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఆరుగురు వీరులు పారాచూట్లతో 2వేల అడుగుల ఎత్తు నుంచి జాతీయ జెండాని చేతపట్టుకుని కిందకు దూకడం ప్రజలని ఆశ్చర్య పరిచింది. రఫేల్, హార్వర్డ్, తేజస్, మిగ్ వంటి యుద్ధ విమానాలతో చేసిన విన్యాసాలు వావ్ అనిపించాయి. మరో కొత్త విమానం హెచ్‌టీటీ 40 చేసిన విన్యాసం అయితే చూపరులను మైమరపించింది. ఈ విన్యాసాలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన సతీమణి దుర్గా స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, వైమానిక దళం ఉన్నతాధికారి చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రత్యేక వేదికపై నుంచి చూశారు. అయితే ఇంతటి ఆహ్లాదకరమైన ప్రదర్శనలో ఊహించని విధంగా తీవ్ర విషాదం జరిగింది. అసలేం జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
షో అయిపోయి తిరిగి వస్తున్న క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ అపశృతిలో ఊపిరాడక నలుగురు, గుండెపోటుకు గురై మరొకరు చనిపోయారు. ఎయిర్ షోకు ఊహించిన దాని కన్నా భారీగా జనాలు రావడమే ఈ ప్రమాదానికి కారణం. ఒక్క చెన్నై నుంచే కాకుండా సిటీ పరిసర ప్రాంతాల నుంచీ కూడా జనాలు తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ షో పూర్తయింది. షో అయిపోయాక ఇంటికి వెళ్లేందుకు జనాలు అష్ట కష్టాలు పడ్డారు. అసలు ఎంతలా జనాలు వచ్చారంటే బీచ్ దగ్గర లైట్ హౌస్ మెట్రో స్టేషన్, చెన్నై ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్ లో నిలబడడానికి కూడా చోటు లేదు. అసలు బయటకి పోవడానికి కూడా జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. కొందరు రిస్కు చేసి జర్నీ చేయగా.. మరి కొంతమంది మాత్రం స్టేషన్లలోనే గడిపాలసిన పరిస్థితి నెలకొంది. ఇక అన్నా స్క్వేర్ లోని బస్టాప్ కు చేరుకున్నా, అక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది.
పైగా దీనికి తగ్గట్టు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించలేదు. వాతావరణం వేడిగా ఉండటం వలన జనాలు తట్టుకోలేకపోయారు. చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది అయితే తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయారు. ఈ క్రమంలోనే తోపులాట మొదలైంది. పరిస్థితి తొక్కిసలాటకు దారి తీసింది. దీంతో అధికారులు, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ ఘటనలో 250 మంది స్పృహతప్పి పడిపోయారు. వారిని దగ్గరలోని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పోలీస్ అధికారులకు కూడా చుక్కలు కనిపించాయి. చాలా కష్టపడి ట్రాఫిక్ ను క్లియర్ చేసి అంబులెన్సులను తరలించారు. మెరీనా బీచ్ నుంచి సిటీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంది. వాహనాలు ముందుకు కదల్లేక పోయాయి. దీంతో కొన్ని చోట్ల వాహనాలు ఇరుక్కుపోయాయి. ఈ విధంగా చెన్నై ఎయిర్ షో వీక్షించడానికి వచ్చిన ప్రజలకు ఊహించని విధంగా షాక్ తగిలింది. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి చెన్నై మెరీనా బీచ్ వద్ద జరిగిన ఈ అపశృతిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.