కుటుంబంలో దారుణ విషాదం! చేతికి అందొచ్చిన బిడ్డలు కళ్ళ ముందే!

Delhi Crime News: అందమైన కుటుంబం.. హ్యాపీగా సాగిపోతున్న జీవితం. అన్నా.. ఇద్దరు చెల్లెల్లు వివాహ వేడుకకు వెళ్లి సంతోషంగా ఎంజాయ్ చేసి తిరిగి వస్తున్న సమయంలో అనుకోని సంఘటన జరిగింది.

Delhi Crime News: అందమైన కుటుంబం.. హ్యాపీగా సాగిపోతున్న జీవితం. అన్నా.. ఇద్దరు చెల్లెల్లు వివాహ వేడుకకు వెళ్లి సంతోషంగా ఎంజాయ్ చేసి తిరిగి వస్తున్న సమయంలో అనుకోని సంఘటన జరిగింది.

ఇటీవల మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత క్షేమంగా ఇంటికి చేరుతామా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  రోడ్డు ప్రమాదాలు, కరెంట్ షాక్, అగ్రి ప్రమాదాలు, హార్ట్ ఎటాక్ ఇలా ఎన్నో కారణాల వల్ల చనిపోతున్నాన్నారు. చేతికి అందొచ్చిన ముగ్గురు బిడ్డలు.. ఎంతో హ్యాపీగా ఉన్న కుటుంబం. కానీ విధి వారిపై పగ బట్టింది. మృత్యువు ఆ బిడ్డలను వెంటాడింది.. రోడ్డు ప్రమాదం రూపంలో ప్రాణాలు బలితీసుకుంది. చేతికి అందొచ్చిన బిడ్డలు ఒకేసారి కన్నుమూయడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలకు వెళ్లిన అన్నా చెల్లెళ్లు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం తీవ్ర విషాదాన్నినింపింది. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శివ సింగ్ తన కుటుంబంతో ఎకోటెక్-3 కులేసర గ్రామంలోని మధుబన్ విహార్ కాలనీలో కొంతకాలంగా జీవిస్తున్నాడు. పారిశ్రామిక వాడలోని బల్పుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. గురువారం తన కుమారుడు సురేంద్ర సింగ్ (28), అతని చెల్లెళ్లు శైలి(26), అన్షు (14)  తమ దగ్గరి బంధువు పెళ్లికి హాజరయ్యేందుకు కస్నాకు బయలుదేరారు. పెళ్లి వేడుకలు ముగిసిన తర్వాత కస్నా నుంచి తిరిగి బయలుదేరారు. శుక్రవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం వీరి బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మొదట శైలి, అన్షు అక్కడిక్కడే కన్నుమూశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి బయలు దేరి పరిస్థితి సమీక్షించారు.

తీవ్రంగా గాయపడ్డ సురేంద్ర సింగ్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పోలీసులు పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.  శివ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్తు తెలియని కారు డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. బైక్ ని ఢీ కొట్టిన వాహనం పోలీసులు ఇంకా గుర్తించలేదు. వాహనాన్ని గుర్తించడానికి నిఘా కెమెరాల ఫుటేజ్ ని స్కాన్ చేస్తున్నామని తెలిపారు. త్వరలో నింధితులను పట్టుకుంటామని తెలిపారు.  ఈ ప్రమాదంలో ముగ్గురు బిడ్డలను కోల్పోయిన శివ సింగ్ కి ఇప్పుడు చిన్న కుమారుడు శివం మాత్రమే మిగిలాడు. ఈ ఘటన స్థానికంగా అందరి హృదయాలను కలచి వేసింది.

Show comments