వీడియో: డబ్బులు ఇవ్వలేదని దారుణం.. ఏకంగా ఇంటిపై బాంబులు వేసి..

నేటికాలంలో డబ్బుల కోసం ఎంతటి దారుణానికైన తెగబడుతున్నారు. మనిషి ప్రాణం కంటే.. డబ్బుకే విలువ ఎక్కువ ఇస్తున్నారు. ఈ ధనం విషయంలో ఇప్పటికే అనేక ఘోరాలు జరగ్గా తాజాగా ఓ వ్యక్తి ఏకంగా బాంబు దాడి చేశాడు.

నేటికాలంలో డబ్బుల కోసం ఎంతటి దారుణానికైన తెగబడుతున్నారు. మనిషి ప్రాణం కంటే.. డబ్బుకే విలువ ఎక్కువ ఇస్తున్నారు. ఈ ధనం విషయంలో ఇప్పటికే అనేక ఘోరాలు జరగ్గా తాజాగా ఓ వ్యక్తి ఏకంగా బాంబు దాడి చేశాడు.

ప్రస్తుతం సమాజంలో కొందరు మనుషులు డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మనిషి ప్రాణాల కంటే.. డబ్బులకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఇంకా మరికొందరు అయితే బెదిరింపులకు పాల్పడి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకుంటే.. దాడి చేయడం చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా  హత్య కూడా చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి సెక్యూరిటీ డబ్బులు ఇవ్వలేదని ఏకంగా ఇంటికపై బాంబులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ జిల్లాలోని ఘమా పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న భారత్ కృషి సమాజ్ స్కూల్ సమీపంలో  బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా బాంబుపేలుడు శబ్దం రావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. ఆనంద్ ఠాకూర్ అనే వ్యక్తి..మాన్ సింగ్ ఠాకూర్ అనే వ్యక్తి ఇంటిపై బాంబులు విసిరాడు. తాను అడిగిన సెక్యూరిటీ డబ్బులు ఇవ్వలేదని ఆనంద్ ఠాకూర్ ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వీడియోను చూసినట్లు అయితే..రెండు చేతుల్లో రెండు బాంబులతో ఆనంద్ ఆ వీధిలో తిరిగాడు. కాసేపటికి మాన్ సింగ్ ఠాకూర్ ఇంటి వద్దకు వచ్చి..తొలుత ఓ బాంబ్ విసిరాడు. అయితే అది పేలపోవడంతో రెండో బాంబు విసిరాడు. అది పేలడంతో పాటు పెద్దగా శబ్దం వచ్చింది.

ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. దీంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ బాంబు దాడికి ముందు, అతను సమీపంలోని గుడిలో దేవుడి దండం పెట్టుకున్నాడు. ఒక్క బాంబు దాడితో తృప్తి చెందని ఠాకూర్ కాల్పులు జరుపుతూ సంఘటన స్థలం నుండి పారిపోయాడు. స్థానికంగా ఉండే వివిధ వ్యాపారవేత్తలను కూడా బెదిరించి, డబ్బులను వసూలు చేస్తుంటాడని ఆనంద్ ఠాకూర్ పై ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఘమాపూర్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి అధికారులు సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు.

Show comments