P Venkatesh
Delhi Airport:ఢిల్లీలో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలి వాన ధాటికి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ పోర్ట్ టెర్మినల్ పైకప్పు కూలిపోయింది.
Delhi Airport:ఢిల్లీలో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలి వాన ధాటికి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ పోర్ట్ టెర్మినల్ పైకప్పు కూలిపోయింది.
P Venkatesh
దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పాటుగా వేగంగా గాలులు వీస్తుండంతో అక్కడక్కడ హోర్డింగులు కూలిపోతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో గాలి వాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షం కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది. గాలివాన ధాటికి టెర్మినల్-1లో పైకప్పు కూలిపోయింది. ఎయిర్ పోర్టులో టెర్నినల్ కుప్పకూలిపోయి కొన్ని కార్లపై పడడంతో అవి ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.
ఢిల్లీలో కొన్ని రోజుల క్రితం ఎండలు దంచికొట్టాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 45-50 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఇక ఇటీవల వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. అయితే నేడు ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం ధాటికి ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 వద్ద పైకప్పు కూలిపోయింది. కుప్ప కూలిన టెర్నినల్ పైకప్పు కార్లపై పడడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. దీనికి సంబంధించిన సమాచారం తెల్లవారుజామున 5.30 గంటలకు అందిందని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఘటనాస్థలికి మూడు అగ్నిమాపక వాహనాలను పంపించి సహాయక చర్యలు చేపట్టామని వెల్లడించారు.
ఇక ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ఢిల్లీలో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఢిల్లీలో వచ్చే ఏడు రోజులపాటు వాతావరణం సాధారణంగా మేఘావృతమై, గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు ఎక్స్ లో (ట్విట్టర్ లో) తెలిపారు.
#WATCH | 4 people were injured after a roof collapsed at the Terminal-1 of Delhi airport.
(Video source – Delhi Fire Service) pic.twitter.com/Uc0qTNnMKe
— ANI (@ANI) June 28, 2024