P Venkatesh
NEET UG 2024: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ లీకేజీపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు కాగా సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది.
NEET UG 2024: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ లీకేజీపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు కాగా సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది.
P Venkatesh
ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారం విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. డబ్బు కోసం కకృతిపడి ఎగ్జామ్ పేపర్లను లీక్ చేస్తూన్నారు కొందరు వ్యక్తులు. లక్షలాది మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రతిభ గల విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లుతోంది. దేశంలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ లీకేజీపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం పెట్టే ప్రవేశ పరీక్ష. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నిటికీ ఈ పరీక్ష వర్తిస్తుంది. ఈ ఏడాది కూడా మే 05న నీట్ పరీక్షను నిర్వహించారు. దాదాపు 23 లక్షల మంది ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు హాజరయ్యారు. అయితే నీట్ ఫలితాల్లో ఎప్పుడూ లేని విధంగా 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. దీంతో నీట్ పేపర్ లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంత మంది విద్యార్థులు టాప్ ర్యాంకు సొంతం చేసుకోవడంపై అనుమానాలు తలెత్తాయి. ఈ వ్యవహారంపై కొందరు వ్యక్తులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
ఝార్ఖండ్‌లోని హజారీబాగ్, బిహార్‌లోని పట్నాలోని కేంద్రాల్లో నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకైన మాట నిజమేనని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. నీట్ ఎగ్జామ్ మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రీ ఎగ్జామ్ అవసరం లేదని తెలిపింది. నీట్ పేపర్ లీకేజీతో 155 మంది లాభపడ్డారని వెల్లడించింది. ఈ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలి. ప్రతిష్టాత్మకంగా భావించే నీట్ పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవని తెలిపింది. రీ ఎగ్జామ్ పెట్టడం వల్ల లక్షలాది మంది విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.