CPM ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం!

Sitaram Yechury: కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి ఊపిరి తిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ వైరల్ అవుతుంది.

Sitaram Yechury: కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి ఊపిరి తిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ వైరల్ అవుతుంది.

కేంద్ర రాజకీయాల్లో కీలక నేతగా పేరు తెచ్చుకున్న సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తాజాగా సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు నేడు సీపీఎం పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ లో ఆయనకు చికిత్స జరుగుతుంది. సీతారాం ఏచూరి కొన్నిరోజులుగా న్యుమోనియా లాంటి ఛాతి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఐసీయూలో చికిత్స జరుగుతున్నట్లు సీపీఎం పార్టీ ప్రకటించింది. ఆయనను ఓ డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తుందని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికట్ గా ఉన్నట్లు పార్టీ వెల్లడించింది. ఆగస్టు 19వ తేదీన ఏచూరిని ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల్లోకి వెళితే..

సోమవారం రాత్రి నుంచి ఆయన పరిస్థితి విషమంగా మారిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే సీపీఎం పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న విషయం తెలియగానే కీలక నేతలు ఢిల్లీ బయలుదేరారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీబీ రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్ పుణ్యవతి ఇప్పటికే ఢిల్లీ చేరి ఆయన పరిస్థితిపై ఆరా తీశారు. గత 20 రోజులుగా సీతారాం ఏచూరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షిణిస్తూ వస్తుంది. ఇటీవల ఎయిమ్స్ లో ఆయన కంటి ఆపరేషన్ జరిగింది.

సీతారాం ఏచూరి విషయానికి వస్తే.. కాకినాడకు చెందిన ఆయన ఏపీ, తెలంగాణ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. విభజన సమయంలో పార్లమెంట్ లో తనదైన స్వరాన్ని వినిపించారు. పార్లమెంట్ లో ప్రభుత్వాల ప్రజా వ్యతిరేకత విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టేవారు. కమ్యూనిస్టు అగ్ర నాయకులు అయిన పుచ్చలపాటి సుందరయ్య, ఈఎంఎస్, బీటీఆర్, హరికిషన్ సింగ్ సుర్జీత్, బసవ పున్నయ్య, జ్యోతి బస్ లతో కలిసి పనిచేశారు. ఆయన ఆరోగ్యం కుదుట పడాలని నాయకులు కోరుకుంటున్నారు.

Show comments