iDreamPost
android-app
ios-app

సూది మింగేసిన బాలుడు.. అయస్కాంతంతో బయటకు..

చిన్నపిల్లలు ప్రతి వస్తువును నోట్లో, ముక్కుల్లో, చెవిలో దూర్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అనారోగ్యానికి గురౌతుంటారు. ఆసుపత్రికి తీసుకెళితే కానీ అసలు విషయం బయటపడదు. వారేమి మింగేరోనన్న విషయం. తాజాగా ఓ బాలుడు సూదిని మింగేస్తే..

చిన్నపిల్లలు ప్రతి వస్తువును నోట్లో, ముక్కుల్లో, చెవిలో దూర్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అనారోగ్యానికి గురౌతుంటారు. ఆసుపత్రికి తీసుకెళితే కానీ అసలు విషయం బయటపడదు. వారేమి మింగేరోనన్న విషయం. తాజాగా ఓ బాలుడు సూదిని మింగేస్తే..

సూది మింగేసిన బాలుడు.. అయస్కాంతంతో బయటకు..

చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు మట్టి, ఇసుక తింటుంటారు. స్కూల్లో బలపాలు, చాక్ పీసులు నమిలేస్తుంటారు. కొంత మంది సరదాగా నోట్లో రూపాయి బిల్లులు పెట్టుకోవడం చేస్తుంటారు. తెలియక మింగేస్తే.. గొంతుకు అడ్డుపడుతుంటాయి. చెవిలో, ముక్కుల్లోకి కూడా చిన్న చిన్న వస్తువులు పెట్టుకుంటూ.. ఇబ్బంది పడుతుంటారు. ఆ తర్వాత నొప్పి అనడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళితే..అసలు విషయం బయటకు వస్తుంది. వీరి చేసే కొన్ని దురద పనులు ప్రాణం మీదకు తెస్తుంటాయి. ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. మొన్న ఓ చిన్నారి మాంసం ముక్క తింటుండగా గొంతులో ఇరుక్కుపోయి మరణించిన సంగతి విదితమే.

తాజాగా ఓ బాలుడు పొరపాటున సూదిని మింగేశాడు. ఆ సూది ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. దీంతో దగ్గు, రక్త స్రావంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఏం జరిగిందో తెలిసింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. అయితే వైద్యులు.. ఎటువంటి ఆపరేషన్ చేయకుండా.. కేవలం అయస్కాంతం ద్వారా బయటకు తీయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ఓ 7 ఏళ్ల బాలుడు పొరపాటున కుట్టుమిషన్ సూదిని మింగేశాడు. తర్వాత అస్వస్థతకు గురి కావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. పరిశీలించిన వైద్యులు 4 సెంటీ మీటర్ల పొడవున్న సూది గొంతు నుండి ఎడమ ఊపిరితిత్తులోకి వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ చిక్కుకున్నట్లు ఎక్స్ రే ద్వారా గ్రహించారు.

పీడియాట్రిక్ వైద్యులు ఆ సూదిని బయటకు తీయడం కోసం ఓ ఆలోచన చేశారు. ఆపరేషన్ చేయకుండా మాగ్నెట్ ద్వారా బయటకు తీసేందుకు ప్రయత్నించి.. చాందిని చౌక్ మార్కెట్ లోని ఓ వ్యక్తిని సంప్రదించి 4 మిల్లీమీటర్ల వెడల్పు, 1.5 మిల్లీమీటర్ల మందం ఉన్న అయస్కాంతాన్ని తెప్పించారు. వెంటనే అతడికి చికిత్స మొదలు పెట్టారు. క్లిష్టమైన ఎండోస్కోపిక్ ప్రక్రియ ద్వారా అయస్కాంతం సహాయంతో ఊపిరితిత్తులో ఇరుక్కుపోయిన సూదిని బయటకు తీశారు. ఆపరేషన్ చేసి నిడిల్ తీయడం కష్టమని భావించి.. ఈ ప్రక్రియ ద్వారా దాన్ని బయటకు తీశారని వైద్యులు వెల్లడించారు.