iDreamPost
android-app
ios-app

లోన్లు తీసుకున్న కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే..?

  • Author singhj Published - 07:02 PM, Thu - 10 August 23
  • Author singhj Published - 07:02 PM, Thu - 10 August 23
లోన్లు తీసుకున్న కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే..?

హోమ్ లోన్ తీసుకున్న కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అదిరిపోయే శుభవార్త చెప్పింది. వడ్డీ రేట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుంచి స్థిర వడ్డీ రేటుకు మారేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఆవిష్కరిస్తూ ఈ ఫ్రేమ్​వర్క్ గురించి తెలియజేశారు. త్వరలో ఈ ఫ్రేమ్​వర్క్​ అందుబాటులోకి రానందున.. లోన్ టెన్యూర్, ఈఎంఐల గురించి రుణగ్రహీతలకు ముందుగానే స్పష్టంగా తెలియజేయాలని బ్యాంకులకు ఆయన సూచించారు.

లోన్లు తీసుకున్న కస్టమర్లకు సమాచారం అందించకుండా, వారి సమ్మతి లేకుండానే బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ లోన్​ల టెన్యూర్​ను అసమంజంగా పొడిగించిన ఉదంతాలు గతంలో అనేకం ఉన్నాయని శక్తికాంత దాస్ చెప్పుకొచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా ఆర్థిక సంస్థలు, అమలు చేసే విధంగా ఓ ఫ్రేమ్​వర్క్​ను తీసుకురానున్నట్లు తెలిపారు. లోన్లు తీసుకున్న వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించడానికి బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు అనుసరించేలా సరైన కండక్ట్ ఫ్రేమ్​వర్క్​ను ప్రతిపాదించామన్నారు ఆర్బీఐ గవర్నర్. గృహ రుణాలు తీసుకున్న వారితో పాటు వాహనాలు, ఇతర లోన్లు తీసకున్న వారు కూడా కొత్త విధానం కింద అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం పొందే వీలుంటుందని ఆర్బీఐ తెలిపింది.

కొత్త ఫ్రేమ్​వర్క్ ప్రకారం.. లోన్ టెన్యూర్ వ్యవధి లేదా ఈఎంఐలో ఏదైనా మార్పులు చేసేటప్పుడు సంబంధిత సమాచారాన్ని లోన్ తీసుకున్న వారికి బ్యాంకులు కచ్చితంగా తెలియజేయాలి. ఫ్లోటింగ్ వడ్డీ నుంచి స్థిర వడ్డీ విధానానికి మారే ఛాన్స్ కల్పించడం లేదా ముందస్తు చెల్లింపునకు రుణ గ్రహీతలకు బ్యాంకులు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ల అమలుకు సంబంధించి ఆయా ఛార్జీల వివరాలను కస్టమర్లకు స్పష్టంగా తెలియజేయాలి. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తామని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో లోన్లు తీసుకున్న లక్షలాది మంది రుణ గ్రహీతలకు ఊరట లభిస్తుందని, వడ్డీ రేట్లు మారినప్పుడల్లా పైన పడే భారం నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.