రైలులో ప్రయాణిస్తుండగా ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే ట్రీట్మెంట్!

Railways Launches Rail Madad Service: ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ భారీ శుభవార్తను అందించింది. రైలులో ప్రయాణించే వారికి ఒక సర్వీసును ప్రారంభించారు. ఈ సేవల వల్ల మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా వెళ్లచ్చు.

Railways Launches Rail Madad Service: ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ భారీ శుభవార్తను అందించింది. రైలులో ప్రయాణించే వారికి ఒక సర్వీసును ప్రారంభించారు. ఈ సేవల వల్ల మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా వెళ్లచ్చు.

భారతదేశంలో ఉన్న ప్రజా రవాణా వ్యవస్థలో రైల్వే మార్గమే ఎంతో పెద్దది. రోజులో కొన్ని లక్షల మంది ఈ సాధనం ద్వారా తమ గమ్య స్థానాలకు చేరుతూ ఉంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థగా మన రైల్వే శాఖ ఎదుగుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యవస్థలో ఉన్న లోటు పాట్లు, మెరుగు పరుచుకోవాల్సిన సేవలకు సంబంధించి రైల్వే శాఖ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు వందే భారత్ లను కూడా తీసుకొచ్చింది. వందే భారత్ లోనే స్లీపర్ బెర్తులను కూడా తీసుకొస్తున్నారు. అయితే రైల్వే ప్రయాణంలో ఒక భయం అయితే ఉంటుంది. ప్రయాణం మధ్యలో ఆరోగ్య సమస్యలు వస్తే ఏంటి పరిస్థితి అని? ఆ సమస్యకు రైల్వే శాఖ చెక్ పెట్టబోతోంది.

రైలులో ప్రయాణిస్తున్నప్పుడ ఆరోగ్య సమస్యలు వస్తే ఇకపై ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైల్వే శాఖ రైల్ మదద్ సేవను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా మీరు రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఆరోగ్య సమస్య వస్తే టీటీని సంప్రదించాల్సి ఉంటుంది. మీకు ఆన్ కాల్ సర్వీస్ లో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు. అలాగే వైద్య సహాయం అవసరం అయితే.. టీటీఈ తర్వాతి స్టేషన్ మేనేజర్ కు సమాచారం అందజేస్తారు. రైలు తర్వాతి స్టేషన్ కు చేరుకునేలోగా.. వైద్య బృందంతో రెడీగా ఉంటారు. అలాగే పారా మెడికల్ బృందం కూడా ఉంటుంది. కాబట్టి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఇకపై ఆరోగ్య సమస్యలు వస్తే ఎలాంటి భయం అక్కర్లేదు అని భరోసా కలిగిస్తున్నారు.

ఇప్పటికే ఈ సేవలను ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారు కూడా. జూన్ 1 నుంచి జులై 31వ తేదీ వరకు 2,109 మంది రైల్వే ప్రయాణికులు ఆన్ కాల్ డాక్టర్ సేవలను వినియోగించుకున్నారు. అలాగే ఇటీవల కొచ్చువేలి- ఎల్టీటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో ఒక ప్రయాణికుడికి గుండెనొప్పి వచ్చింది. టీటీఈకి సమాచారం ఇవ్వగానే తర్వాతి స్టేషన్ లో సకాలంలో వైద్య సహాయం అందించి.. ప్రాణాలు కాపాడారు. అలాగే కొల్పాపూర్- ముంబయి మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ రైలులో గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. కర్జాత్ స్టేషన్ లో వైద్య బృందాన్ని సిద్ధం చేసి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ మహిళకు ఆడి శిశువు జన్మించింది. ఈ నేపథ్యంలోనే రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు అని భరోసా కలిగిస్తున్నారు.

Show comments