iDreamPost
android-app
ios-app

Winter Health: చలిని తగ్గించి శరీరాన్ని వెచ్చగా హెల్తీగా మార్చే ఫుడ్స్ ఇవే!

  • Published Dec 02, 2024 | 3:22 PM Updated Updated Dec 02, 2024 | 3:22 PM

Winter Health: చలికాలంలో సీజనల్ వ్యాధులు ఇంకా ఇతర సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

Winter Health: చలికాలంలో సీజనల్ వ్యాధులు ఇంకా ఇతర సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

  • Published Dec 02, 2024 | 3:22 PMUpdated Dec 02, 2024 | 3:22 PM
Winter Health: చలిని తగ్గించి శరీరాన్ని వెచ్చగా హెల్తీగా మార్చే ఫుడ్స్ ఇవే!

చలికాలంలో కచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో అనేక ఆరోగ్య సమస్యలు రావొచ్చు. ముఖ్యంగా న్యుమోనియా, ఆస్తమా, జలుబు, విపరీతమైన దగ్గు ఎక్కువగా వేధిస్తాయి. చలికాలంలో సాధారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందువల్ల సీజనల్ వ్యాధులు ఎటాక్ చేస్తాయి. కాబట్టి ఈ సీజన్‌లో శరీరానికి శక్తి చాలా అవసరం. పైగా చలికాలంలో శరీరంలో ఉష్ణోగ్రత లెవల్స్ తగ్గుతాయి కాబట్టి తీవ్రంగా చలి, కండరాల నొప్పులు కూడా ఇబ్బంది పెడతాయి. కాబట్టి కొన్ని రకాల ఆహారాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక చలి కాలంలో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా, వెచ్చదనంగా ఉంటుందో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చలికాలంలో కచ్చితంగా సూప్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే సూప్ ఘాటుగా ఉంటుంది. ఇందులో ఘాటుగా ఉండే పదార్థాలను వాడతారు. అందుకే వేడి వేడి సూప్స్ తాగడం వల్ల.. శరీరం వెచ్చగా ఉంటుంది. దీంతో మనకు ఎక్కువగా చలి వేయదు. అందువల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా అంతే కాకుండా నెయ్యి, మిరియాలు, కూరగాయలు, తృణ ధాన్యాలు చలికాలంలో కచ్చితంగా తీసుకోవాలి.అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అన్ని సీజన్ ల కంటే వింటర్ సీజన్‌లో వీటిని తింటే చాలా మంచిది. ఎందుకంటే డ్రై ఫ్రూట్ మంచి పౌష్టిక ఆహారం. అందుకే దీన్ని తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. వీటిని తింటే రోగాలతో పోరాడే శక్తి వస్తుంది. అలాగే చలికాలంలో కచ్చితంగా పసుపు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కాస్త ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే పసుపులో వేడి చేసే గుణాలు ఎక్కువ ఉన్నాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు త్వరగా ఇన్ ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడకుండా, శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.

అలాగే ఈ సీజన్‌లో అల్లాన్ని కచ్చితంగా ఎక్కువగా తీుకోవాలి. ఎందుకంటే అల్లం చలిని తగ్గించి.. మన శరీరంలో వెచ్చదనాన్ని పెంచుతుంది. ప్రతి రోజూ అల్లం టీ తాగినా లేదా అల్లంతో చేసిన ఆహారాలు తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.అలాగే ఈ సీజన్‌లో ఎక్కువగా గుడ్లు, చికెన్ తినాలి. ఇవి వేడి చేసే ఆహారాలు. ఇవి శరీరంలో ఉష్ణోగ్రత లెవల్స్‌ని పెంచుతాయి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అందువల్ల మన శరీరానికి శక్తిని ఇస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలసట, నీరసాన్ని తగ్గిస్తాయి. మన శరీరాన్ని వేడిగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే ఈ సీజన్‌లో ఎక్కువగా గుడ్లు, చికెన్ ఉండే ఫుడ్స్ తీసుకోండి. అయితే వీటిని ఎలా పడితే అలా చేసుకొని అస్సలు తినకూడదు. చాలా మంది వేపుళ్ళు చేసుకుంటారు. వేపుల్లకి బదులు చక్కగా అల్లం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని పులుసు పెట్టుకొని తింటే మంచిది. కాబట్టి చలికాలంలో కచ్చితంగా ఈ ఫుడ్స్ తినండి.

గమనిక: ఈ సమాచారం పలు ఆరోగ్య నిపుణుల సమాచారం ప్రకారం ఇవ్వడం జరిగింది. వీటిని తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom