Vinay Kola
Health: చాలా మంది కూడా కింద కూర్చొని తినరు. అయితే కింద కూర్చొని తినడం వలన చాలా లాభాలు ఉన్నాయి.
Health: చాలా మంది కూడా కింద కూర్చొని తినరు. అయితే కింద కూర్చొని తినడం వలన చాలా లాభాలు ఉన్నాయి.
Vinay Kola
అప్పట్లో మన పెద్దలు భోజనం చేసేటప్పుడు కాళ్ళు మడిచి నేలపై కూర్చుని భోజనం చేసేవారు. మనం కూడా మన చిన్నప్పుడు అలాగే తినే వాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో ఈ అలవాటు కనుమరుగై పోయింది. అందరూ డైనింగ్ టేబుల్ పై కూర్చొని తినడం అలవాటు చేసుకున్నారు. అలాగే చాలా మంది కూడా నుంచొని భోజనం చేస్తారు. కానీ ఇలా టేబుల్ పై కూర్చొని తినడం, నుంచొని తినడం ఏమాత్రం మంచిది కాదు. కింద కూర్చొని తింటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఇలా భోజనం చేయడం వలన కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కింద కూర్చొని తినడం జీర్ణక్రియకి చాలా మంచిది. ఇలా కూర్చుని తినడం వల్ల మన బాడీకి పోషకాలు సరిగ్గా అందుతాయి. నేలపై కూర్చుని తినేటప్పుడు సుఖాసనంలో తినాలి. అంటే కాళ్ళు మడిచి కూర్చొని భోజనం చేయాలి. ఇది జీర్ణక్రియని పెంచి పోషకాలను గ్రహిస్తుంది. ఈ భంగిమ సహజంగానే ఉదర కండరాలని బిగిస్తుంది. అందువల్ల జీర్ణక్రియ బాగా మెరుగయ్యి ఉబ్బరం తగ్గుతుంది. ఎటువంటి జీర్ణ సమస్యలు రానే రావు. నేలపై కూర్చుంటే నరాలకి సపోర్ట్ ఉంటుంది. ఈ భంగిమ పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థని కంట్రోల్ చేస్తుంది. ఇలా తింటే మనకు ప్రశాంతంగా, రిలాక్సింగ్‌గా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా చేసి పోషకాలను ఈజీగా బ్యాలెన్స్ చేస్తుంది.
నేలపై కూర్చుని తినడం వల్ల చాలా తృప్తిగా తింటారు. అంత ఎక్కువగా తినరు. ఎందుకంటే ఈ భంగిమ సరైన నోటి పనితీరుకి సహాయపడుతుంది. మిమ్మల్ని అతిగా తినకుండా చేస్తుంది. అధిక బరువు సమస్యతో బాధ పడేవారికి ఈ భంగిమ చాలా మంచిది. దీని వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. ఇలా తినడం దవడ, నాలుక కదలికల్ని మెరుగ్గా చేస్తుంది. ఈ భంగిమ మన వెన్నుపాముని ఆరోగ్యంగా చేేస్తుంది. ఈ భంగిమ వెన్నెముక నిటారుగా, సపోర్ట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. మన వెన్ను, మెడనొప్పిని సులభంగా తగ్గిస్తుంది. నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు. ఈ భంగిమ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇలా తినడం వలన జీవన నాణ్యత కూడా పెరుగుతుంది. అంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఫిట్ గా ఉంటారు. అయితే కింద కూర్చొని తినేటప్పుడు కచ్చితంగా నేలను శుభ్రం చేసుకొని తినాలి. కాబట్టి కింద కూర్చొని భోజనం చేయండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి. ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.