వీడియో: పేపర్ లీకేజ్ ఆరోపణ.. కుర్చిలో నుంచి మహిళా ప్రిన్సిపాల్‌ను బలవంతంగా తొలగింపు!

ఇప్పటికే గవర్నమెంట్‌ పరీక్ష పేపర్ల దగ్గర నుంచి దేశంలో అతి కఠినమైన నీట్‌ పరీక్ష వరకు ప్రతిది పేపర్‌ లీకేజీ అవుతున్న విషయం తెలిసిందే. కాగా, రోజు రోజుకి విద్యా వ్యవస్థలో ఈ పేరు లీకేజీ కుంభకోణంకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ క్రమంలోనే తాజాగా పేపర్‌ లీకేజీ విషయంలో స్కూల్‌ ప్రిన్సిపల్‌ హస్తం ఉందని సిబ్బంది మొత్తం ఆమెను ఏం చేశారంటే..

ఇప్పటికే గవర్నమెంట్‌ పరీక్ష పేపర్ల దగ్గర నుంచి దేశంలో అతి కఠినమైన నీట్‌ పరీక్ష వరకు ప్రతిది పేపర్‌ లీకేజీ అవుతున్న విషయం తెలిసిందే. కాగా, రోజు రోజుకి విద్యా వ్యవస్థలో ఈ పేరు లీకేజీ కుంభకోణంకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ క్రమంలోనే తాజాగా పేపర్‌ లీకేజీ విషయంలో స్కూల్‌ ప్రిన్సిపల్‌ హస్తం ఉందని సిబ్బంది మొత్తం ఆమెను ఏం చేశారంటే..

దేశంలో విద్యా వ్యవస్థ అనేది చాలా విలువైనది, పెద్దది. మరి, అలాంటి గొప్ప విద్యా వ్యవస్థలోని విద్యార్థులు తమ భవిష్యత్తులకు పునాదులుగా పీఠం వేయడం కోసం చాలా కష్టపడుతుంటారు. ముఖ్యంగా రాత్రి, పగలు ఎంతో కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటారు. అలాగే మంచి ర్యాంకులు సాధించలని  ఆశపడుతుంటారు. కానీ, వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఇటీవల కాలంలో చాలామంది విద్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ముఖ్యంగా పేపరు లీకేజు రూపంలో విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి దారుణాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో.. తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం పేపరు లీకేజీ కుంభకోణంలో ఓ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ హస్తం ఉందని ఆ స్కూల్‌ సిబ్బంది  ఆమెను స్కూల్‌ బయటకు తోసేశారు. ఇంతకి ఎక్కడంటే..

ఇప్పటికే గవర్నమెంట్‌ పరీక్ష పేపర్ల దగ్గర నుంచి దేశంలో అతి కఠినమైన నీట్‌ పరీక్ష వరకు ప్రతిది పేపర్‌ లీకేజీ అవుతున్న విషయం తెలిసిందే. కాగా, రోజు రోజుకి విద్యా వ్యవస్థలో ఈ పేరు లీకేజీ కుంభకోణంకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ముఖ్యంగా ఈ పేపర్‌ లీకేజీ కారణంగా కష్టపడి చదివే విద్యార్థుల  జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దీనిపై చాలామంది  ఇప్పటికే చాలా మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో.. పేపర్‌ లీక్ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఒక ప్రిన్సిపల్‌ను సిబ్బంది అంతా కలిసి బయటకు తోసేశారు. పైగా ఆమె  ఫోన్ కూడా లాగేసుకొని, కూర్చి మీద నుంచి లేపి, బలవంతంగా బయటకు పంపారు.  ఇక ఈ ఘటనలో . విద్యాసంస్థ ఛైర్మన్‌ కూడా సిబ్బందితో జతకలిశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో  వైరల్‌గా మారాయి.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన యూపీపీఎస్‌సీ రివ్యూ ఆఫీసర్- అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్‌ (RO-ARO) పశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌కు చెందిన బిషప్ జాన్సన్‌ గర్ల్స్‌ స్కూల్‌పై ఆరోపణలు వచ్చాయి.  అంతేకాకుండా.. పరీక్ష ప్రారంభం కావడానికి ముందు పేపర్ లీక్‌ జరిగిందని అధికారులు గుర్తించారు. ఇక దానికి సంబంధించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆ విద్యాసంస్థకు చెందిన ఉద్యోగి వినీత్ జశ్వంత్‌ను అదుపులోకి తీసుకుంది. అలాగే ఈ వ్యవహారంలో ప్రిన్సిపల్‌ పారుల్ పాత్ర కూడా వెలుగులోకి వచ్చిందని యాజమాన్యం ఆరోపించింది. దాంతో ఆమె స్థానంలో కొత్త ప్రిన్సిపల్‌గా షిర్లే మాస్సేను నియమించింది.  అయితే షిర్లే రావడం చూసి, పారుల్‌ ప్రిన్సిపల్ గదికి వెళ్లి గడియపెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో స్కూల్‌ సిబ్బంది తలుపు తెరిచి, ఆ గది నుంచి ఆమెను బయటకు పంపారు. ఆ క్రమంలో ఆమె ఫోన్ బలవంతంగా తీసేసుకున్నారు. కుర్చీ నుంచి పైకి లేపేశారు. తర్వాత షిర్లే వచ్చి బాధ్యతలు చేపట్టగా.. సిబ్బంది అంతా కొత్త హెడ్‌కు అభినందనలు తెలిపారు.

కాకపోతే ఈ ఘటనపై పారుల్‌ పోలీసు కేసు పెట్టారు. తనను లైంగికంగా వేధించారంటూ ఫిర్యాదు చేశారు. సీసీటీవీ దృశ్యాల్లో ఎక్కడా కూడా ఆమెను భౌతికంగా తాకినట్టుగా లేదని యాజమాన్యం వాదించింది. పైగా తమ విద్యాసంస్థ నుంచి ఆమె రూ.2.40 కోట్ల అక్రమ లబ్ధి పొందిందని ఆరోపించింది. మరోపక్క, ఆమె చేసిన ఫిర్యాదుతో పోలీసులు పలువురు సిబ్బందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ  ఘటన కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. పలువురు నెటిజన్స్‌  ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడటం చాలా సిగ్గు చేటు అంటూ మండిపడుతున్నారు. మరి, ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments