అకౌంట్ లో జీరో బ్యాలెన్స్..ATM నుంచి 10 వేలు తీసుకోవచ్చు! ఎలా అంటే…

దేశ ప్రజల కోసం మోదీ సర్కార్ ఎన్నో పథకాలను, ఇతర కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చింది. అలానే పేద ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్రం వివిధ రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది.

దేశ ప్రజల కోసం మోదీ సర్కార్ ఎన్నో పథకాలను, ఇతర కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చింది. అలానే పేద ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్రం వివిధ రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది.

ప్రతి ఒక్కరి డబ్బు అనేది చాలా అవసరం. అందుకే  అందరూ బ్యాంకుల్లో తమ డబ్బులను దాచుకుంటారు. అలానే అవసరమైన ప్రతిసారి తమ ఖాతాలోనే డబ్బులను ఏటీఎం నుంచి డ్రా చేసుకుంటారు. ఇలా మనం ఏటీఎంలో నుంచి డబ్బులు విత్ డ్రా చేయాలంటే.. అందుకులో కచ్చింగా నగదులు ఉండాలనే సంగతి అందరికి తెలిసిందే. అయితే అకౌంట్ లో రూపాయి లేకున్న కూడా..ఏటీఎం నుంచి రూ.10 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు. మీరు వినడానికి ఆశ్చర్యంగా ఉన్న.. ఇది మాత్రం నిజం. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

దేశ ప్రజల కోసం మోదీ సర్కార్ ఎన్నో పథకాలను, ఇతర కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చింది. అలానే పేద ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్రం వివిధ రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అలా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన ఒకటి. దీనిని 2014 ఆగష్టు 15న నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అలానే ఆగస్టు 28 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద లబ్దిదారులు పోస్టాఫీసులు, ప్రభుత్వ, పైవేట్‌ బ్యాంకులలో సున్న బ్యాలెన్స్ తో ఖాతాలు ఓపెన్ చేయవచ్చు. ఈ స్కీమ్ కింద ఓపెన్ చేసిన అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉంటాల్సిన అవసరం లేదు. జన్‌ ధన్‌ యోజన ఖాతాలను ప్రభుత్వ పథకాలకు లింక్‌ చేసి లబ్ధిదారులకు నేరుగా నగదు జమ చేస్తున్నారు

ఈ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోయినా ఏటీఎం రూ.10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్(ఓడీ) ద్వారా ఈ పదివేలను పొందే అవకాశం ఉంది. ఓవర్‌డ్రాఫ్ట్ లేదా కష్ట సమయాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓవర్‌డ్రాఫ్ట్ అనేది బ్యాంక్ కస్టమర్లకు అందించే ఒక రకమైన రుణం. అయితే ఈ రుణం కోసం  బ్యాంకుకు వెళ్లి ఫారమ్ నింపడం,  వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవచ్చు. ఎంత డబ్బు వస్తుందనేది ముందుగానే నిర్ణయించబడుతుంది. ప్రతి బ్యాంకు ఓడీ మొత్తం వేరు వేరుగా ఉంటుంది.

ఎవరైనా జన్ ధన్ అకౌంట్ కలిగి  ఉంటే.. ఓవర్ డ్రాఫ్ట్  కింద రూ. 10వేలు పొందవచ్చు. ఆ వ్యక్తి ఈ డబ్బును నేరుగా ఏటీఎం నుండి తీసుకోవచ్చు.  అలా తీసుకున్న ఈ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి. చాలా బ్యాంకులు 10 వేలకు మించి ఓడీ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే అలాంటి ఖాతాల్లో మాత్రం కనీస బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. జన్ ధన్ ఖాతా ద్వారా  ఓవర్ డ్రాఫ్ పై తీసుకునే రుణంకిపై వడ్డీ 2 నుండి 12 శాతం వరకు ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఓవర్‌డ్రాఫ్ట్‌ను ఉపయోగించాలని బ్యాంకింగ్ నిపుణలు సూచించారు.

Show comments