Krishna Kowshik
కార్పొరేట్ ఉద్యోగాలు అంటే ఏమా క్రేజ్. వీటిల్లో ఉండే సదుపాయాలు .. సౌకర్యాలు వేరు. అలాగే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నట్లుగా .. ఇక్కడ కూడా కొత్త రూల్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి.
కార్పొరేట్ ఉద్యోగాలు అంటే ఏమా క్రేజ్. వీటిల్లో ఉండే సదుపాయాలు .. సౌకర్యాలు వేరు. అలాగే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నట్లుగా .. ఇక్కడ కూడా కొత్త రూల్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి.
Krishna Kowshik
మల్టీ నేషనల్ కంపెనీ లేదా కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగం చేయాలని నేటి యువత కలలుకంటున్నారు. ఎందుకంటే.. ఆ కంపెనీల్లో ఉండే సదుపాయలు, సౌకర్యాలు వేరు. వర్క్ ప్రెజర్ ఉన్నా కూడా ఠంచనుగా వచ్చే జీతం, ఏడాదికి ఒకసారి హైక్, ప్రమోషన్స్ వల్ల ఆ ఒత్తిడిని కూడా తట్టుకుని ముందుకు సాగుతుంటారు. అదే విధంగా అక్కడి కల్చర్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. వీకెండ్ హాలీడేస్, పార్టీస్ అంటూ కాస్తంత ఎంజాయ్ మెంట్ ఉంటుంది. అయితే ఇదే కార్పొరేట్ రంగంలో టెక్నాలజీ ఎంత అప్ డేట్‌గా ఉంటుందో.. ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త రూల్స్ పుట్టుకొస్తాయి. ఇప్పుడు ఈ నయా ట్రెండ్స్ సాఫ్ట్ వేర్ పాలిట శాపంగా మారాయి. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి కొన్ని ట్రెండ్స్.
అవే.. డై ప్రమోషన్, ఆఫీస్ షికాకింగ్, కాపీ బ్యాడ్జింగ్, ప్రజెంటీయిజం, డిజిటల్ నొమాడిజమ్ వంటివి ఉన్నాయి. ఇంతకు ఈ నయా ట్రెండ్స్ ఏంటో చూద్దాం. డ్రై ప్రమోషన్ అంటే.. సాధారణంగా ప్రమోషన్ అంటే కేడర్ పెరగడంతో పాటు శాలరీ, ఇతర ప్రోత్సాహకాలు పెరగడం. కానీ ఈ డ్రై ప్రమోషన్.. కేవలం బాధ్యతలు మాత్రమే పెరుగుతాయి. మిగిలివనవీ ఏమీ పెరగవు. ఆఫీస్ పికాకింగ్ అంటే వర్క్ ఫ్రం హోంకు అలవాటుు పడిన ఉద్యోగులను తిరిగి కంపెనీలకు రప్పించే ప్రక్రియే ఇది. మొమీ రాము మొర్రో అంటే.. ఆఫీసులను కొత్త కొత్త హంగులతో తీర్చి దిద్ది.. ఉద్యోగులను ఆఫీసుకు రప్పించేలా చేయడం. కాఫీ బ్యాడ్జింగ్.. ఆఫీసులో నిత్యం కాఫీ తాగుతూ ఉంటారు. కచ్చితంగా ఆఫీసుకు రావాలన్న విధానాన్ని వీరి నిరసిస్తూ.. మేనేజర్లు ముందే కాఫీ తాగుతూ అసహనం వ్యక్తం చేస్తుంటారు.
ఇక ప్రజెంటీయిజం అంటే.. ఉద్యోగులు పనిపైన శ్రద్ధ వహించకపోవడం.. ఆఫీస్ వర్క్ ఎట్మాస్మియర్ పట్ల అసంతృప్తిగా ఉండటం. అంటే తాము చేసిన పనికి సరైన గుర్తింపు రావడం లేదని భావించడం అన్నమాట. తమకు గౌరవం లభించడం లేదని నిత్యం బాధపడుతూ ఉంటారు. ఇక నాట్ బట్ నాట్ లీస్ట్.. డిజిటల్ నొమాడిజమ్..ఉద్యోగులు తమకు నచ్చిన వాతావరణంలో రిమోట్‌గా పని చేయడమే డిజిటల్ నొమాడిజమ్. రిమోట్‌గా పని చేస్తూ నచ్చిన ప్రాంతానికి ప్రయాణించి టెక్నాలజీ సాయంతో పని చేయడమే ఈ ట్రెండ్ ఉద్దేశం. ప్రస్తుతం ఇలాంటి కొత్త ట్రెండ్స్ ఉద్యోగులకు నరకంగా మారుతున్నాయని తెలుస్తోంది. ఈ ట్రెండ్ ఫాలో కాలేక సతమతమౌతున్నారట సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్.