మహిళా ఎంపీ అభ్యర్థిపై దారుణం.. ఆమె ఎనర్జీ సీక్రెట్ సె*క్స్ అంటూ..

ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళా ఎంపీ అభ్యర్థికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె ఎనర్జీ సీక్రెట్ సె*క్స్ అంటూ ఆమె చెప్పినట్టు ఉంది. అయితే ఇందులో నిజమెంత?

ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళా ఎంపీ అభ్యర్థికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె ఎనర్జీ సీక్రెట్ సె*క్స్ అంటూ ఆమె చెప్పినట్టు ఉంది. అయితే ఇందులో నిజమెంత?

రాజకీయం అంటే రాక్షసంగా జనానికి కీడుచేసే యంత్రాంగం అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. పరిస్థితి చూస్తుంటే అలానే తయారైంది. టెక్నాలజీ వచ్చాక లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి జనాన్ని అదే నిజం అని నమ్మిస్తున్నారు. ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఎన్ని దారులు ఉంటే అన్ని దారుల్లో టార్గెట్ చేసి వారి ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. తాజాగా ఓ మహిళా ఎంపీ విషయంలో ఇదే జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా మహువా మొయిత్రా పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లోని కృష్ణానగర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. మీ ఎనర్జీ సీక్రెట్ అని ఒక జర్నలిస్ట్ అడగ్గా ఆమె.. ‘సె*క్స్ సె*క్స్ ట్రూ’ అన్నట్టు ఓ వీడియో వైరల్ అయ్యింది. దీంతో అందరూ ఆ మహిళా ఎంపీ అభ్యర్థి ఎనర్జీ సీక్రెట్ సె*క్స్ అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. పలు మీడియా సంస్థలు దీన్నే రాసుకొచ్చాయి. ఆమె ఎనర్జీ సీక్రెట్ సె*క్సే అంటూ రాసుకొచ్చారు. అసలు విషయం బయటపడ్డాక నాలుక కరచుకున్నారు. నిజానికి అది ఒక ఫేక్ వీడియో. ఆమె అన్నది ఎగ్స్ అనే. కానీ దాన్ని సె*క్స్ అనే అర్ధం వచ్చేలా బ్రెయిన్ వాష్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో చాలా మంది అదే నిజమని ఆమెను తప్పుబట్టారు.

పొలిటీషియన్ వైయుండి.. అందులోనూ ఒక మహిళ అయి ఉండి ఇలాంటి చీప్ కామెంట్స్ చేస్తావా అంటూ ఆమెను ఓ రేంజ్ లో ఏకిపడేశారు. ఆమె వీడియో వైరల్ అవ్వడంతో.. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ అసలు వీడియో క్లిప్ ని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి అది సె*క్స్ కాదు ఎగ్స్ అంటూ స్పష్టత ఇచ్చారు. ఉదయం మీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి అని మహువా మొయిత్రాని అడిగానని.. దానికి ఆమె ఎగ్స్ అని సమాధానమిచ్చారని తమల్ సహా అనే జర్నలిస్ట్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇది హాస్యాస్పదం.. ఎగ్స్ అనే పదాన్ని సె*క్స్ అనే పదంలా వక్రీకరించారని.. కావాలనే ఆడియోను తారుమారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మహిళా ఎంపీ అభ్యర్థి ఎనర్జీ సీక్రెట్ ఎగ్స్ అని తెలిసింది కదా.. ఎవరైనా ఇంకా ఆమె ఎనర్జీ సీక్రెట్ సె*క్స్ అని రాస్తే కనుక అది ఫేక్ అని గుర్తించండి. తప్పుడు ఆడియోతో మహిళా ఎంపీ అభ్యర్థి ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని చూడడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments