iDreamPost
android-app
ios-app

భైరవంకు ఇంకొక్క ఛాన్స్..

  • Published Jun 05, 2025 | 4:30 PM Updated Updated Jun 05, 2025 | 4:30 PM

Bhairavam Movie: కచ్చితంగా వారి ముగ్గురికి భైరవం కంబ్యాక్ ఇస్తుందని అంతా బలంగా నమ్మారు. నిజానికి ఆ సినిమాకు వారు ఎంత ఎఫర్ట్స్ పెట్టగలరో అంతకుమించే చేశారు ఆ ముగ్గురు. కానీ సినిమా మాత్రం అనుకున్నంత రేంజ్ లో హిట్ టాక్ సంపాదించుకోలేకపోయింది. మాస్ ఏరియాల్లో సినిమా బాగానే టాక్ సంపాదించుకుంది. కానీ మిగిలిన ఏరియాల్లో అంతతమాత్రంగానే అనిపించుకుంది.

Bhairavam Movie: కచ్చితంగా వారి ముగ్గురికి భైరవం కంబ్యాక్ ఇస్తుందని అంతా బలంగా నమ్మారు. నిజానికి ఆ సినిమాకు వారు ఎంత ఎఫర్ట్స్ పెట్టగలరో అంతకుమించే చేశారు ఆ ముగ్గురు. కానీ సినిమా మాత్రం అనుకున్నంత రేంజ్ లో హిట్ టాక్ సంపాదించుకోలేకపోయింది. మాస్ ఏరియాల్లో సినిమా బాగానే టాక్ సంపాదించుకుంది. కానీ మిగిలిన ఏరియాల్లో అంతతమాత్రంగానే అనిపించుకుంది.

  • Published Jun 05, 2025 | 4:30 PMUpdated Jun 05, 2025 | 4:30 PM
భైరవంకు ఇంకొక్క ఛాన్స్..

ముగ్గురు హీరోల చాలా గ్యాప్ తర్వాత తెరమీద కనిపించారు. కచ్చితంగా వారి ముగ్గురికి భైరవం కంబ్యాక్ ఇస్తుందని అంతా బలంగా నమ్మారు. నిజానికి ఆ సినిమాకు వారు ఎంత ఎఫర్ట్స్ పెట్టగలరో అంతకుమించే చేశారు ఆ ముగ్గురు. కానీ సినిమా మాత్రం అనుకున్నంత రేంజ్ లో హిట్ టాక్ సంపాదించుకోలేకపోయింది. మాస్ ఏరియాల్లో సినిమా బాగానే టాక్ సంపాదించుకుంది. కానీ మిగిలిన ఏరియాల్లో అంతతమాత్రంగానే అనిపించుకుంది. దానికి కారణం ఏంటని అడిగితే ఎవరైనా తడుముకోకుండా ఖలేజ రీరిలీజ్ అని చెప్పేస్తారు. సరే మొదటి రెండు రోజులు రీరిలీజ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ.. తర్వాతైనా పికప్ చుపించాల్సింది కానీ ఐపీఎల్ క్వాలిఫయ్యర్, ఫైనల్ మ్యాచులు వీకెండ్ తో పాటు వీక్ డేస్ సాయంత్రం, సెకండ్ షోల మీద దెబ్బ కొట్టాయి.

ఈ సినిమాని రూ.30 కోట్ల బడ్జెట్లో నిర్మించారట మేకర్స్. కానీ మొదటి వారం పూర్తయ్యే సమయానికి పది కోట్ల మార్కునే చేరుకుందని అంటున్నారు. అంటే రీచ్ అవ్వాల్సిన టార్గెట్ ఇంకా చాలానే ఉంది. మొత్తంగా 40 శాతం రికవరీ అవుతుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మరో 20 శాతం రికవరీ సాధించొచ్చు. అయితే భైరవంకు ఇంకా ఎంతో కొంత ఛాన్స్ మిగిలే ఉంది. ఈ వారం కమల్ హాసన్ థగ్ లైఫ్ రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ప్రేక్షకుల మీద మరీ అంత ఇంపాక్ట్ చూపించినట్టైతే కనిపించడం లేదు. సో ఆడియన్స్ భైరవంను చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి.

పైగా వచ్చేవారం రావాల్సిన హరి హరవీరమల్లు కూడా పోస్ట్ పోన్ అయినట్టే.ఇది కూడా ఎంతో కొంత భైరవంకు కలిసి వచ్చినట్టే. నిజానికి భైరవం కు గట్టి పోటీ ఏది లేదు. మొదట్లోనే బాగుంది అనే టాక్ సంపాదించుకుంటే ఈరోజు లెక్కలు వేరుగా ఉండేవి. సో భైరవంకు ఇంకొక్క లాస్ట్ ఛాన్స్ మిగిలి ఉందని చెప్పొచ్చు. ఈ వీక్ కనుక పుంజుకుంటే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ లు కొంత వరకు మెరుగుపడతాయి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş