Venkateswarlu
Venkateswarlu
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలెబ్రిటీలు కూడా ఎక్కువయిపోయారు. ఎవరికి వారు సోషల్ మీడియాలో తమ టాలెంట్‌ను నిరూపించుకుని పేరు, డబ్బు సంపాదించుకుంటున్నారు. అయితే, కొంతమంది తక్కువ కాలంలో ఎక్కువ ఫేమస్ కావాలన్న ఉద్ధేశ్యంతో అడ్డదార్లు తొక్కుతున్నారు. పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. తాజాగా, ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవాలన్న ఉద్దేశ్యంతో కారు ఓపెన్ డోర్‌పై స్టంట్ చేశాడు. అతడు అనుకున్నట్లుగానే అతడికి గుర్తింపు వచ్చింది.
గుర్తింపుతో పాటు అతడిపై పోలీస్ కేసు కూడా పడింది. ట్రాఫిక్ పోలీసులు అతడికి ఏకంగా 26 వేల ఫైన్ వేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 18 ప్రాంతానికి చెందిన మహేష్ పాల్ కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి తన కారులో ఫ్రెండ్‌తో కలిసి బయటకు వచ్చాడు. కారు సెక్టార్ 18లోని మెయిన్ రోడ్డుపై వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలో మహేష్.. కారు రూఫ్ విండోలోంచి బయటకు వచ్చాడు. అక్కడ అటు, ఇటు ఊగుతూ స్టంట్లు చేశాడు. దీన్నంతా వెనకాల వస్తున్న ఓ వాహనదారుడు వీడియో తీశాడు.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఆ వీడియో ట్రాఫిక్ అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో అధికారులు అతడిపై చర్యలకు సిద్ధమయ్యారు. ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా కారులో ప్రమాదకర విన్యాసాలు చేసినందుకు అతడిపై కేసు నమోదు చేశారు. దాదాపు 26 వేల రూపాయల ఫైన్ విధించారు. దీంతో మహేష్ పాల్ దిమ్మ తిరిగిపోయింది. ఏదో సరదాకు చేసిన పని తన కొంపముంచుతుందని భావించలేదంటూ వాపోయాడు. మరి, కారులో విన్యాసాలు చేసి 26 వేల ఫైన్ వేయించుకున్న మహేష్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
नोएडा में मौत को दावत @noidatraffic @Uppolice #Noida pic.twitter.com/RlGVLWsIjK
— Nitin Parashar (@Nitinparashar__) August 16, 2023