కేరళ బాధితల కోసం గొప్ప మనసు చాటుకున్న జియో, ఎయిర్ టెల్

కేరళ బాధితల కోసం గొప్ప మనసు చాటుకున్న జియో, ఎయిర్ టెల్

ఇటీవలే కేరళలోని భారీ వర్షాలు కారణంగా వరదలు ముంచెత్తడంతో వయనాడ్ జిల్లాలోని ఎంతటి భీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటికే అక్కడ న్డీఆర్ఎఫ్, ఆర్మీ దళాలు రెస్క్యూ టీంలు సహాయక చర్యలు చేపట్టాగా.. తాజాగా ఇప్పుడు జియో, ఎయిర్ టెల్ టెలికాం సంస్థలు కూడా ఆ రాష్ట్ర ప్రజలకు తమవంతు సహాయం చేస్తూ మంచి మానవత్వంను చాటుకున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇటీవలే కేరళలోని భారీ వర్షాలు కారణంగా వరదలు ముంచెత్తడంతో వయనాడ్ జిల్లాలోని ఎంతటి భీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటికే అక్కడ న్డీఆర్ఎఫ్, ఆర్మీ దళాలు రెస్క్యూ టీంలు సహాయక చర్యలు చేపట్టాగా.. తాజాగా ఇప్పుడు జియో, ఎయిర్ టెల్ టెలికాం సంస్థలు కూడా ఆ రాష్ట్ర ప్రజలకు తమవంతు సహాయం చేస్తూ మంచి మానవత్వంను చాటుకున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇటీవలే కేరళలోని భారీ వర్షాలు కారణంగా వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో కేరళలోని వయనాడ్ జిల్లాలోని ముండక్కయ్, చూరాల్ మాల, అత్తమల నూల్ పూజా వంటి గ్రామాల్లో కొండ చరియలు విరిగిపోడి భీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా ఈ కొండచరియలు కింద పడి నాలు గ్రామాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. దీంతో 285 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 240 మంది ఆచూకీ గల్లంతు అయ్యింది. ఇక ఆ ప్రాంతంలోని ప్రజలను కాపాడటానికి, అలాగే గల్లంతైనా వారి ఆచూకి తెలుసుకోవడానికి గురువారం భారీగా సహాయక చర్యలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే.. ముండక్కయ్, చోర్ మలలో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా బాధితుల్ని కాపాడారు. కాగా,ఇప్పటికే కేరళలోని ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ దళాలు రెస్క్యూ టీంలు సహాయక చర్యలు చేపట్టారు. అంతేకాకుండా.. మరోవైపు సినీ ఇండస్ట్రీకి చెందినవారు కూడా కేరళ వరద బాధితులకు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇప్పుడు జియో, ఎయిర్ టెల్ టెలికాం సంస్థలు కూడా ఆ రాష్ట్ర ప్రజలకు తమవంతు సహాయం చేస్తూ మంచి మానవత్వంను చాటుకున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇటీవల కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకారణంగా అక్కడ వాతవరణం అనుకూలంగా లేదు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాడానికి చాలా కష్టతరంగా మారాయి. ఇక ఈ భయంకరమైన విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు టెలి కమ్యూనికేషన్ ను మరింత మెరుగుపడేలా జీయో, ఎయిర్ టెల్ సంస్థలు తాజాగా ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో తమ టెలికాం వినియోగదారులకు జియో, ఎయిర్ టెల్ కూడా తమవంతు సహాయక చర్యలు అందించేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఈ రెండు నెట్ వర్క్స్ వినియోగించిన కస్టమర్లకు ఉచితంగా సేవలను అందించాలని నిర్ణయించింది.అందులో భాగంగానే.. ఎయిర్ టెల్ రోజుకు 1జీబీ టేడా తో పాటు 100 ఎస్ ఎంఎస్ లు, అన్ లిమిటెడ్ కాల్స్ ను ఉచితంగా మూడు రోజుల పాటు అందించాలని నిర్ణయించింది.

అయితే ఇక్కడ గమనించదగ్గ విషయమేమిటంటే..  వయనాడ్ లోని ప్రస్తుతం  పరిస్థితుల కారణంగా..  ప్రీపెయిడ్ మొబైల్ సర్వీస్ ఎక్స్ పెయిర్ అయిపోయిన వారికి ఈ ఉచిత మొబైల్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తుంది. అలాగే పోస్ట పెయిడ్ కస్టమర్లకు కోసం బిల్ డ్యూ డేట్ ను మరో మరో 30 రోజులకు పొడిగించింది. ఇకపోతే  కేరళలోని కొనసాగుతున్న సహాయక చర్యల ఫలితంగా నెట్ వర్క్ ట్రాఫిక్‌ను నిర్వహించడానికి జియో తన నెట్‌వర్క్ ను మరింత బలోపేతం చేసింది. అలాగే జియో టెలికాం ఆపరేటర్ ఈ ప్రాంతంలో అంతరాయం లేని సేవలను అందించడానికి రెండో ప్రత్యేక టవర్‌ను ఇన్‌స్టాల్ చేసింది.  అంతేకాకుండా.. నెట్‌వర్క్ విస్తరణ పౌరులకు, అధికారులకు ఆటంకంలేని కమ్యూనికేషన్‌ని అందిస్తుంది. అయితే కస్టమర్ల కోసం జియో ఎలాంటి డేటా, కాలింగ్ లేదా సర్వీస్ చెల్లుబాటు ప్రయోజనాలను ప్రకటించలేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్రజల కోసం ఉచిత సేవలను అందించడం అనేది మొట్ట మొదటిసారి ఈ టెలికాం సంస్థలే ముందడగు వేయడం గమన్హారం. మరీ, ఎయిర్ టెల్, జియో సంస్థలు కేరళ ప్రజలకు సేవలు తమవంతు సహయ చర్యలు అందించి మంచి మనసు చాటుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments