Kerala Floods Wayanad 2024- Calamities In July And August: కేరళకు శాపంగా మారిన ఈ 2 నెలలు.. విపత్తులన్నీ అప్పుడే!

Kerala Floods: కేరళకు శాపంగా మారిన ఈ 2 నెలలు.. విపత్తులన్నీ అప్పుడే!

Kerala Floods Wayanad 2024: కేరళలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వయనాడ్ జిల్లాలో వరదలు, కొండచరియలు విరిగిపడి మనుషుల జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గల్లంతైన వారి కోసం వెతుకులాట జరుగుతోంది.

Kerala Floods Wayanad 2024: కేరళలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వయనాడ్ జిల్లాలో వరదలు, కొండచరియలు విరిగిపడి మనుషుల జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గల్లంతైన వారి కోసం వెతుకులాట జరుగుతోంది.

చుట్టూ కొండలు, ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కేరళ సొంతం. అక్కడ కాసేపు ఉంటే మనల్ని మనమే మర్చిపోతాం. అక్కడి ప్రకృతి సోయగాలు అలా ఉంటాయి. అయితే ఇదంతా ప్రతిసారి కనిపించే దృశ్యాలు కాదు. ఇప్పుడు కేరళను వరదలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడటం, బురదతో పాటుగా తలలు లేని మొండాలు, చేతులు- కాళ్లు లేని మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయి. గాడ్స్ వోన్ కంట్రీగా పేరు గాంచిన కేరళకు ఇంతటి దుస్థితి ఏంటి అని రాష్ట్ర ప్రజలే కాదు.. దేశం మొత్తం విచారం వ్యక్తం చేస్తోంది. అయితే కేరళలో ఇలాంటి విపత్తులు అన్నీ దాదాపుగా జులై- ఆగస్టు నెలల్లోనే జరుగుతూ ఉండటం కూడా కొత్త ప్రశ్నలకు తావిస్తోంది.

చీకటి మాసాలు:

కేరళకు టూరిస్టులు ఎక్కువ వస్తారు. అక్కడి కొండలు, అడవుల అందాలు చూసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. అయితే కేరళకు ఎవరు వెళ్లినా కూడా అక్కడ రాత్రి సమయంలో మీకు ఎక్కువ మంది జనాలు కనిపించరు. అది సిటీ అయినా కూడా చీకటి పడితే రోడ్ల మీద ఎవరూ ఉండరు. ముఖ్యంగా జులై- ఆగస్టు నెల్లలో అయితే మీకు మానమ మాత్రుడు కనిపించడు. ఎందుకంటే కేరళలో జులై, ఆగస్టు నెలల చీకటి మాసాలు అంటారు. వారి నమ్మకానికి తగ్గట్లు అక్కడ జరిగిన విపత్తులు అన్నీ దాదాపుగా ఈ రెండు నెలల్లోనే జరిగాయి. అలా ఎందుకు అనేది కూడా ఎవరూ చెప్పలేరు. అయితే కొండల ప్రాంతం కాబట్టి.. జులై- ఆగస్టు నెలల్లో వర్షాల కారణంగా విపత్తులు ఎక్కువ జరుగుతాయి అనుకుంటారు.

విపత్తులు:

ప్రస్తుతం కేరళలోని వయనాడ్ జిల్లాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 163కు చేరింది. మరో వందకు పైగా స్థానికులకు గాయాలు అయ్యాయి. వందల మంది ఆచూకీ గల్లంతు అయ్యింది. 2018 ఆగస్టు నెలలో కేరళలో వచ్చిన వరదల్లో ఏకంగా 483 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన దేశాన్ని చలించిపోయేలా చేసింది. సాధారణం కంటే 23 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. దాంతో రిజర్వాయర్లు నిండిపోయి.. ఒకేసారి 34 డ్యాముల గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో వేల సంఖ్యలో కొండచరియలు విరిగి పడినట్లు చెప్పారు.

2019 ఆగస్టు నెలలో మలప్పురం, వయనాడ్, కోళికోడ్ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి 76 మంది చనిపోయారు. 2020 ఆగస్టు 6న ఇడుక్కి జిల్లా మెట్టిముడిలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాల కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అందరికీ తెలిసిందే. అయితే నిపుణుల చెప్పేది ఏంటంటే.. అరేబియా సముద్రం వేడెక్కడం వల్ల కేరళలో డీప్ క్లౌడ్ సిస్టమ్ క్రియేట్ అవుతోంది అంటున్నారు. అందుకే అధిక వర్షాపాతం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

Show comments