iDreamPost
android-app
ios-app

శబరిమల వెళ్లే భక్తులు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

  • Published Nov 21, 2024 | 2:32 PM Updated Updated Nov 21, 2024 | 2:32 PM

Sabarimala Devotees: దేశం నలుమూలల నుంచి అయ్యప్ప భక్తులు శభరిమల యాత్ర వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

Sabarimala Devotees: దేశం నలుమూలల నుంచి అయ్యప్ప భక్తులు శభరిమల యాత్ర వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

శబరిమల వెళ్లే భక్తులు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

శబరిమల తీర్థయాత్ర సీజన్ వచ్చేసింది.దేశం నలుమూలల నుంచి అయ్యప్ప భక్తులు శభరిమల యాత్ర వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, ఎవరిని సంప్రదించాలి, ఏదైనా ప్రమాదం జరిగితే హెల్ప్ లైన్ నంబర్ ఏంటీ? అన్న విషయం గురించి తెలుసుకోవడం తప్పనిసరి. మీరు తెలుసుకోవడం మాత్రమే కాదు.. అయ్యప్ప మాలదారులకు ఈ విషయం తెలియజెప్పాలి. ఈ ఏడాది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకునేందుకు కేరళ ఆరోగ్య శాఖ అన్ని ప్రధాన మార్గాలలో తమ సేవలను ప్రారంభించేందుకు సిద్దమయ్యింది. వివిధ భాషలు మాట్లాడే వైద్యులు, వాలంటీర్లతో పంబలో 24/7 నియంత్రణ కేంద్రం ఏర్పాలు చేసింది.స్వామి సన్నిదానికి వచ్చే సమయంలో యాత్రికులకు అసౌకర్యంగా ఉంటే సమీపంలోని ఆరోగ్య కేంద్రం నుండి సహాయం భక్తులకు సూచించింది. మండల దీక్ష తర్వాత శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం వెళ్లేభక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. తీర్థయాత్ర సమయంలో మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని ఇతర సూచనలు ఏంటో తెలుసుకుందాం.

  • మీరు ఇప్పటికే ఏదైనా అనారోగ్యానికి చికిత్స పొందుతున్నట్లయితే, తీర్థయాత్ర సమయంలో కూడా మీ వద్ద అవసరమైన మందులు, వాటికి సంబంధించిన వివరాలు, ప్రిస్కిప్షన్స్ జాగ్రత్తగా ఉంచుకోవాలి.
  • తీర్థయాత్ర సీజన్‌లో మీ రెగ్యులర్ మందులను ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. వాటిని కంటిన్యూ చేయడం ఆరోగ్యానికి మంచింది.
  • ఎక్కువగా నడక, వ్యాయామం లాంటివి అలవాటు లేని వారికి ఒక్కసారే కొండెక్కడం చాలా కష్టం. అందుకోసం మాల వేసుకున్న 41 రోజులు నిత్యం పూజ, ఫలహారం అనంతరం కాసేపు నడక, వ్యాయామం ప్రాక్టీస్ చేయండి.
  • రాళ్లు, రప్పల మధ్య కొండెక్కుతున్నప్పుడు అలసిపోతారు. బలవంతంగా నడిచే ప్రయత్నం అస్సలు చేయొద్దు. అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోండి.నీలమల మార్గాం ద్వారా కాకుండా స్వామి అయ్యప్పన్ రహదారిని ఎంచుకుంటే మంచిది. భోజనం చేసిన వెంటనే యాత్ర ప్రారంభించకుండా కాస్త విశ్రాంతి తీసుకుంటే మంచిది.
  • వైద్య సహాయం కోసం 04735 203232 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. ఈ నెంబర్ సాధ్యమైనంత వరకు భక్తులకు షేర్ చేయండి.
  • వింటర్ సీజన్ కావడం వల్ల చలి ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు గోరు వెచ్చని నీరు మాత్రమే తాగండి. ఎప్పకప్పుడు మీ చేతులు శుభ్రంగా ఉండేలా కడుక్కొండి.
  • చల్లని ఆహారం కన్నా కాస్త వేడి ఆహారం తీసుకోవాడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
  • బహిరంగ ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకోవడం మంచిది కాదు. వ్యర్థ పదార్ధాలను అక్కడ ఏర్పాటు చేసిన డబ్బాల్లో మాత్రమే వేయాలి.
  • పాము కాటుకు గురయినట్లయితే దగ్గరలో ఉన్న వైద్య శిభిరానికి వెళ్లిండి.శబరిమలలోని ఆరోగ్య కేంద్రాలలో యాంటీవీనమ్, చికిత్స అందుబాటులో ఉన్నాయి.
  • నీలిమల, పంబా, అపాచిమేడు, సన్నిధానం ఆసుపత్రులలో గుండె చికిత్స, చెకప్‌లుతో పాటు సంబంధిత సేవలు అందుబాటులో ఉన్నాయి.