P Venkatesh
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. విచారణ అనంతరం ఈడీ బుధవారం రాత్రి అరెస్టు చేసింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. విచారణ అనంతరం ఈడీ బుధవారం రాత్రి అరెస్టు చేసింది.
P Venkatesh
కొంతకాలం నుంచి ఆర్థికపరమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోరెన్ ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ సాగిస్తోంది. విచారణలో భాగంగా ఇటీవల నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా నిన్న (బుధవారం) ఈడీ సీఎం హేమంత్ సోరెన్ నివాసానికి చేరుకుని దాదాపు 7 గంటలు విచారించింది. విచారణ అనంతరం సీఎం సోరెన్ ను ఈడీ అరెస్టు చేసింది. అరెస్టు అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. అయితే అరెస్టుకు ముందే బుధవారం రాత్రి సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సోరెన్ రాజీనామాను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదించారు.
హేమంత్ సోరెన్ అరెస్టుతో జార్ఖండ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. సోరెన్ అరస్టు అవుతారన్న ఊహగానాల నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి ఆయన అభిమానులు రాంచీకి చేరుకున్నారు. దీంతో అక్కడ ఏవిధమైన ఘర్షనలు చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. విచారణలో భాగంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసులో సోరెన్ ను ప్రశ్నించగా ఆయన సమాధానాలు ఇవ్వకుండా దాటవేసే ధోరణి అవలంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి హేమంత్‌ను ఆయన ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి తరలించి ఆ తర్వాత సోరెన్ ను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. సోరెన్ అరెస్టుతో తదుపరి జార్ఖండ్ సీఎంగా పార్టీ సీనియర్ నేత చంపయీ సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Jharkhand CM Hemant Soren arrested by ED in land scam case
Read @ANI Story | https://t.co/JhpdyOxeXx#HemantSoren #ED #Jharkhand #HemantSorenArrested pic.twitter.com/S4zLui7xIE
— ANI Digital (@ani_digital) January 31, 2024