Instant Loan: ఆన్‌లైన్​లో ఇన్‌స్టంట్ లోన్ తీసుకుంటున్నారా? మీరు బుక్ అయినట్టే అర్థం!

మనుషుల ఆర్థిక అవసరాలను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. మీకెంత కావాలంటే అంత.. జస్ట్ వన్ క్లిక్​తో అంటూ వల వేస్తున్నారు. ఇందులో గానీ పడ్డారా? ఇక పనైపోయినట్లే!

మనుషుల ఆర్థిక అవసరాలను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. మీకెంత కావాలంటే అంత.. జస్ట్ వన్ క్లిక్​తో అంటూ వల వేస్తున్నారు. ఇందులో గానీ పడ్డారా? ఇక పనైపోయినట్లే!

మనుషుల ఆర్థిక అవసరాలను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. మీకెంత కావాలంటే అంత.. జస్ట్ వన్ క్లిక్​తో అంటూ వల వేస్తున్నారు. ఇందులో గానీ పడ్డారా? ఇక పనైపోయినట్లే! మనం మాట్లాడుకుంటోంది లోన్ యాప్స్ గురించేనని ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. ఒకప్పుడు లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఆస్తి పత్రాలు, ఇల్లు లేదా బంగారం మీదో లోన్స్ ఇచ్చేవారు. నెలవారీ వడ్డీలు కట్టుకొని డబ్బులు ఉన్నప్పుడు పూర్తిగా చెల్లించేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు లోన్ యాప్స్ వచ్చేశాయి. ఎలాంటి గ్యారెంటీ అవసరం లేకుండా, కనీసం సంతకం కూడా పెట్టకుండానే లోన్స్ వస్తుండటంతో చాలా మంది ఎగబడి తీసుకుంటున్నారు. చేతలో మొబైల్ ఉంటే చాలు.. జస్ట్ ఒక్క క్లిక్​తో రుణం పొందొచ్చు.

బ్యాంకుల్లో లోన్స్ తీసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దానికి టైమ్ కూడా ఎక్కువగానే పడుతుంది. కానీ లోన్ యాప్స్​లో మాత్రం క్షణాల్లో ఒక్క క్లిక్​తో రుణం పొందొచ్చు. అయితే లోన్‌ యాప్స్ మాఫియాలా తయారైంది. అన్నీ కాదు గానీ.. చాలా మటుకు కంపెనీలు మాఫియాలా ప్రవర్తిస్తున్నాయని ఫిర్యాదులు రావడం గురించి వింటున్నాం. తీసుకున్న రుణం మీద బారువడ్డీ, చక్రవడ్డీ వేస్తూ వినియోగదారులను పీక్కు తింటున్నాయి ఈ యాప్స్. డబ్బులు కట్టకుంటే యూజర్ల ఫ్యామిలీ ఫొటోస్​ను మార్ఫింగ్ చేసి బెదిరించడం వంటివి చేస్తున్నారు. వీటి ప్రెజర్ తట్టుకోలేక కొందరు ప్రాణాలు తీసుకున్న ఘటనల గురించి కూడా వార్తల్లో చూస్తున్నాం. అందుకే ఇలాంటి ఇబ్బందులు రావొద్దంటే ఇన్​స్టంట్ లోన్ తీసుకోవాలనుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. లోన్ ఇస్తున్న కంపెనీ విశ్వసనీయత గురించి తెలుసుకోవాలి. నియంత్రణ ప్రమాణాలకు తగినట్లు ఉందని నిర్ధారించుకున్న తర్వాత లోన్ తీసుకోవడం ఉత్తమం.

కస్టమర్ రేటింగ్స్ చెక్ చేయడం కూడా మర్చిపోవద్దు. దీని ద్వారా రుణం ఇస్తున్న సంస్థ గురించి మరింత అంచనాకు రావొచ్చు. ఇన్​స్టంట్ లోన్ యాప్స్​ను ఇతర సోర్స్​ల కంటే నేరుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్​లోడ్ చేయడం బెటర్ అని ఎక్స్​పర్ట్స్ సూచిస్తున్నారు. ఆఫ్​లైన్ అడ్రస్, వెబ్​సైట్ సరిగ్గా ఉన్నాయో లేవో ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. చట్టబద్ధమైన సంస్థలు అయితే పక్కాగా తమకు సంబంధించిన వివరాలను వెబ్​సైట్ ద్వారా వెల్లడిస్తాయి. వెబ్ సైట్ లేని లోన్ యాప్స్​ అయితే స్కామ్ బారిన పడే ప్రమాదం ఉందని గ్రహించాలి. ఒక్క ఈఎంఐ కట్టకపోయినా భారీగా పెనాల్టీలు వేస్తుంటాయి యాప్స్. కాబట్టి లోన్ తీసుకోవడానికి ముందే షరతులు, రూల్స్ చదవాలి. వడ్డీ రేట్లు, లేట్ పేమెంట్ ఫీజులు, ట్యాక్స్​ గురించి కూడా అడిగి తెలుసుకోవాలి. లోన్ ఇస్తున్న సంస్థ మెసేజ్, ఈ-మెయిల్ లాంటి సేవల్ని అందిస్తుందా? లేదా? కూడా తెలుసుకోవడం ఉత్తమమని ఎక్స్​పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు.

Show comments