క్యాబ్ మిస్ కావడమే ఆమె పాలిట శాపమైంది..

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశీ బాట పడుతున్న ఇండియన్ అమ్మాయిలు, అబ్బాయిలు. ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న యువతీ, యువకుల్ని బలితీసుకుంటున్నాయి..

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశీ బాట పడుతున్న ఇండియన్ అమ్మాయిలు, అబ్బాయిలు. ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న యువతీ, యువకుల్ని బలితీసుకుంటున్నాయి..

పిల్లల కోసం ఎంతటి కష్ట నష్టాలైన భరిస్తుంటారు తల్లిదండ్రులు. పిల్లలు ఎంత వరకు చదువుకుంటామంటే.. అంత వరకు చదివిస్తున్నారు. ఇక ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశీ బాట పడుతుంటే.. పొంగిపోతుంటారు. పిల్లలను మిస్ అవుతున్నప్పటికీ వారి బంగారు భవిష్యత్తుకు అడ్డుకాకూడదని వేల కిలో మీటర్ల దూరంలో ఉండే ప్రాంతాలకు పంపిస్తుంటారు. కానీ అక్కడకు వెళ్లాక.. ఊహించని ప్రమాదాల్లో భారతీయులు మరణిస్తున్నారు. అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కందుల జాహ్నవి రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి విదితమే. ఈ ఘటనను నుండి ఇంకా తేరుకోనేలేదు.. ఇప్పుడు మరో అమ్మాయి మృత్యువాత పడింది.

అయితే ఇక్కడ దేశమే మారింది. దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన విదిశ అనే యువతి దుర్మరణం చెందింది. మంగళూరు ఉళ్లాలకు చెంది విదిశ.. దుబాయ్‌లో పని చేస్తుంది. మంగళూరు తాలుకా పంచాయతీ మాజీ ఉపాధ్యక్షుడు విఠల కులాల్ ఏకైక కుమార్తె అయిన విదిశ.. సఅక్కడే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసింది. బెంగళూరులో ప్రైవేట్ సంస్థలో ఏడాది పాటు పని చేసిన విదిశ.. 2019లో దుబాయ్ వెళ్లి.. అక్కడ ఎయిర్ పోర్ట్ లో అధికారిగా పని చేస్తోంది. రోజూ సంస్థ క్యాబ్‌లో ఉద్యోగానికి వెళ్లేది ఆమె. కాగా, గురువారం ఆ వాహనం మిస్ కావడంతో తన స్వంత కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లింది.

మార్గమధ్యంలో కారు అదుపు తప్పి.. పక్కన ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు..విదిశను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. కాగా, ఆరు నెలల క్రితమే దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందింది విదిశ. ఈ సందర్భంగా కొత్త కారు కొనుగోలు చేసింది. ఆ వాహనంలో వెళుతుండగానే.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆమె మరణవార్త తెలిసి తండ్రి కన్నీరు మున్నీరు అయ్యారు.  ఉద్యోగం కోసం వెళ్లి మృత్యువాత పడటంతో విలపిస్తున్నారు. ఒక్కాగానొక్క కూతురు ముద్దు ముచ్చట చూడాలనుకున్న తల్లిదండ్రులకు పుత్రికా శోకం మిగిలింది. విదిశ మృతదేహాన్ని మంగళూరుకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు కుటుంబ సభ్యులు.

Show comments