iDreamPost
android-app
ios-app

కొన్ని గంటలుగా బెంగుళూరులో భారీ వర్షం! ఒక్క దెబ్బతో 2 లాభాలు!

Bengaluru Rains: బెంగళూరు సిటీని వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ వర్షాలతో బెగంళూరు వాసులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

Bengaluru Rains: బెంగళూరు సిటీని వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ వర్షాలతో బెగంళూరు వాసులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

కొన్ని గంటలుగా బెంగుళూరులో భారీ వర్షం! ఒక్క దెబ్బతో 2 లాభాలు!

బెంగళూరులో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. నిన్నటి వరకు ఎర్రని ఎండలు, నీటి ఎద్దడి, ఎటు చూసినా ట్రాఫిక్ జామ్ తో అల్లాడిన ఈ బెంగళూరు మహా నగరం.. శుక్రవారం మాత్రం తడిసి ముద్దైపోయింది. కొన్ని గంటల పాటు కురిసిన భారీ వర్షంతో బెంగళూరు నగరవాసులు సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే వారికి ఈ భారీ వర్షంతో ఒకే దెబ్బకు రెండు సమస్యలు తీరిపోయాయి. వర్షం నీళ్లు రహదారుల మీదకు రావడంతో.. పలుచోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ వర్షాల పుణ్యమా అని బెంగళూరు వాసులకు రెండు కష్టాలు తీరినట్లు అయ్యింది.

ఈ వేసవికాలం ప్రారంభానికి ముందు నుంచే కర్ణాటక రాజధాని బెంగళూరు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి బెంగళూరులో నీటి ఎద్దడి వచ్చింది. తాగడానికి, వాడుకోవడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. చాలా మాల్స్ లో అసలు వాష్ రూమ్ వాడుకోవడాన్ని నిషేదించారు. అలాగే పెద్ద పెద్ద అపార్టుమెంట్లు కూడా నీళ్లు అల్లాడిపోయాయి. ఈ నీటి ఎద్దడే అనుకుంటే.. మరోవైపు గత కొన్ని రోజులుగా బెంగళూరు వాసులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈ సమస్యలకు అన్నింటికీ చెక్ చెప్తూ బెంగళూరులో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇంకేముంది.. నగరవాసులు అంతా ఆనందంతో ఎగిరి గంతేశారు.

సిలికాన్ సిటీని వరుణ దేవుడు కరుణించాడు. దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతుంటే.. బెంగళూరు ప్రజలు మాత్రం వర్షంలో తడిసి ముద్దైపోయారు. శుక్రవారం మాత్రం బెంగళూరులో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని గంటలపాటు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాలు, రోడ్లు అన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. ఈ వర్షంతో బెంగళూరు వాసులకు రెండు కష్టాలు తాత్కాలికంగా తీరినట్లు అయ్యింది. ప్రధానంగా అక్కడ ఏర్పడిన నీటి ఎద్దడి తీరేందుకు మార్గం చూపించినట్లు అయ్యింది. ఈ వర్షంతో కచ్చితంగా భూగర్భజలం పెరుగుతుంది. కాబట్టి నీటి సమస్య కొంతలో కొంత తీరిపోవచ్చు. అలాగే పగటి పూట ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న వారికి ఇది ఉపశమనం కల్పించింది. అంతేకాకుండా ఈ వర్షం కారణంగా బెంగళూరు వాసులు కొన్ని గంటలపాటు ట్రాఫిక్ సమస్య నుంచి కూడా బయటపడ్డారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. మే 7 నుంచి తెలంగాణలో వర్షం కురిసే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.