వరుణుడి బీభత్సం.. 6 గంటల్లో 300 మి.మి. వాన!

Heavy Rains- IMD Issues Orange Alert: వరుణుడి ప్రతాపానికి అక్కడి ప్రజలు వణికిపోతున్నారు ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Heavy Rains- IMD Issues Orange Alert: వరుణుడి ప్రతాపానికి అక్కడి ప్రజలు వణికిపోతున్నారు ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వరుణుడు తన ప్రతాపం చూపించాడు. సోమవారం తెల్లారి 7 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి వర్షం కురిసింది. ఈ బీభత్సానికి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. ఏకంగా 6 గంటల సమయంలో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయ్యింది. ప్రస్తుతం వరుణుడి ప్రతాపానికి ముంబయి ప్రజలు వణికిపోతున్నారు. అత్యధికంగా గోవండిలో 315 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అటు పోవాయ్ లో 314 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఈ భారీ వర్షానికి జనజీవనం స్థంభించి పోయింది. లోతట్టు ప్రాంతాలు, రైల్వే ట్రాకులు, రోడ్లు అన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి.

ముంబయిని వరుణుడు జోరు వానలతో అతలాకుతలం చేస్తున్నాడు. ముంబయి మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. ఈరోజు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రగకటించారు. దాదాపుగా 6 గంటలపాటు బ్రేక్ లేకుండా కురుసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మొత్తంగా ముంబయి, ఠాణె, పాల్ఘర్, రాయ్ గడ్ లో ఈ లోకల్ సర్వీసుల ద్వారా రోజూ 30 లక్షల మంది వరకు ప్రయాణం చేస్తుంటారు. అటు రోడ్లు కూడా జలమయం అయ్యాయి. వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల లోతు నీళ్లలో ప్రయాణం చేయలేక నానా అవస్తలు పడుతున్నారు. ప్రజలు రోడ్ల మీదకు రావొద్దని సూచనలు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కొనసాగుతూనే ఉంది.

అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరాయంగా సేవలందిస్తున్నారు. ఇప్పటికే నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా అవస్థలు పడుతున్న వారిని కాపాడుతున్నారు. నిన్న ఠాణెలోని షాపూర్ ప్రాంతంలో రిసార్ట్ లో 49 మంది చిక్కుకుంటే వారిని రక్షించారు. అలాగే పాల్ఘర్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరద నీటిలో చిక్కుకున్న 16 మందిని రక్షించిన విషయం తెలిసిందే. అయితే ముంబయి ప్రజలు ఇంకా ఊపిరి పీల్చుకునే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముంబయి సహా ఠాణె, కొంకణ్ బెల్ట్, పాల్ఘర్ కు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలి అంటూ సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాల్సింది అంటూ సూచిస్తున్నారు.

Show comments