వీడియో: బస్సు డ్రైవర్ గా భార్య.. భర్త కండక్టర్.. వీళ్ల కథకి ఫిదా అవ్వాల్సిందే!

నేటికాలంలో మహిళలు అన్ని రంగాల్లో అడుగుపెట్టి.. విజయాలు సాధిస్తున్నారు. అంతరిక్షంలో అడుగు పెట్టి..తమ సత్తా ఎంటో మహిళమణులు చాటి చెబుతున్నారు. తాజాగా ఓ మహిళ భారీ వాహనాన్ని నడుపుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

నేటికాలంలో మహిళలు అన్ని రంగాల్లో అడుగుపెట్టి.. విజయాలు సాధిస్తున్నారు. అంతరిక్షంలో అడుగు పెట్టి..తమ సత్తా ఎంటో మహిళమణులు చాటి చెబుతున్నారు. తాజాగా ఓ మహిళ భారీ వాహనాన్ని నడుపుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

నేటికాలంలో మహిళలు అడుగుపెట్టని రంగమంటూ ఏది లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్ వేరు కొలువు, అంతరిక్ష పరిశోధన రంగంలో సైతం మహిళలు సత్తచాటుతున్నారు. ఇంకా ఆటోమొబైల్ పరిశ్రమలోను వారు అడుగు పెట్టి విజయాలు సాధిస్తున్నారు. అలానే పలువురు మహిళలు బస్సు, కార్ల , ఆటోలు నడుపుతూ మహిళ శక్తిని చాటి చెబుతున్నారు. తాజాగా మహిళ కూడా బస్సును నడుపుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అందులోనూ రద్దీగా ఉండే ఢిల్లీ నగరంలో ఎంతో ధైర్యంగా బస్సును నడిపి..స్త్రీ శక్తి ఏంటో నిరూపించారు. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్ ప్రాంతానికి చెందిన వేద్ కుమారి.. తన కుటుంబతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో  రద్దీగా ఉండే రూట్లో బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారి కావాలనేది ఆమె చిన్ననాటి కల. కానీ అనుకోని పరిస్థితుల కారణంగా బస్సు డ్రైవర్‌గా బాధ్యతలు చేపట్టింది. ఆమె ఢిల్లీలోని ఘజియాబాద్-పడౌన్ మార్గంలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తోంది.

ఆఫీస్‌ కార్యకలాపాల కోసం చాలా మంది ప్రజలు వెళ్లడంతో ఈ మార్గం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ట్రాఫిక్‌ ఎప్పుడూ రద్దీగా ఉన్నా.. వేద్‌ కుమారి  భయపడలేదు. ఆమె ఎంతో ధైర్యంగా ఈ మార్గంలో డ్రైవర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే.. ఆమె భర్త ఇదే బస్సుకు కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరు కలిసి డిపోలో నుంచి బస్సును ప్రారంభించిన తర్వాత కౌశాంబి ప్రాంతం నుంచి బయలుదేరి, ఘజియాబాద్ చేరుకుని, తరువాత బస్సులో పడౌన్ ప్రాంతానికి వెళ్తారు. వేద్‌ కుమారి విద్యాభ్యాసం గురించి  మాట్లాడుకుంటే.. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది.  కుమారి సంస్కృతంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది.

బస్సు డ్రైవర్‌గా ఉద్యోగం సాధించినప్పటికీ.. పోలీసు కావాలనేది ఆమె కోరిక. అందుకే బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తునే పోలీసు జాబ్ కోసం ప్రయత్నిస్తూనే ఉందని సమాచారం. పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్న సమయంలో బస్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్‌ను చూసింది. దీంతో  వేద్ కుమారి ఆ పోస్టుకు దరఖాస్తు చేసుకుని,సెలెక్ట్‌ అయింది. అనంతరం వేద్‌ కుమారి ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ ద్వారా బస్సు డ్రైవర్‌గా శిక్షణ పొందింది.

గతేడాది ఏప్రిల్ 2022లో కౌశాంబి డిపోలో విధానపరమైన శిక్షణ తీసుకుంది. భారత్‌ లాంటి అధిక జనాభా కలిగిన దేశంలో రోడ్లపై వాహనాలు నడపడం కత్తి మీద సాములాంటింది. ట్రాఫిక్ రద్దీ తో పాటు ఫుట్‌పాత్‌పై వేలాడుతూ ఉండే ప్రయాణికులు ఉంటారు. అందుకే సిటీ రోడ్లపై ప్రభుత్వ బస్సులను నడపాలంటే డ్రైవర్లకు చాలా కఠినమైన శిక్షణ ఇస్తారు. అనుభవం కలిగిన వారికే ఆ పోస్టులు కేటాయిస్తారు. అలానే వేద్‌ కుమారి ప్రస్తుతం ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మరి.. ఈ మహిళపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments