Delhi: వీడియో: ఆటోవాలాను రక్తమోడేలా కొట్టిన యువతి! ఎందుకో తెలుసా?

వీడియో: ఆటోవాలాను రక్తమోడేలా కొట్టిన యువతి! ఎందుకో తెలుసా?

Delhi: చిన్న చిన్న కారణాలతో కొంతమంది తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలకు కూడా పాల్పపడుతున్నారు.

Delhi: చిన్న చిన్న కారణాలతో కొంతమంది తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలకు కూడా పాల్పపడుతున్నారు.

ఇటీవల కొంతమంది చిన్న చిన్న విషయాలకు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ఆ సమయంలో విపరీతమైన కోపం, ఉద్రేకం, డిప్రేషన్ కి లోనవుతున్నారు. కొంతమంది విచక్షణ కోల్పోయి ఎదుటి వారిని తిట్టడం, దాడులు చేయడం లాంటివి చేస్తున్నారు. ఒక్కోసారి ప్రాణాలు తీయడం, తమ ప్రాణాలు తీసుకోవడం జరుగుతుంది. దేశంలో నిత్యం ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఓ యువతి తనకు సైడ్ ఇవ్వని కారణంతో ఆటోవాలాను అతి దారుణంగా రక్తం వచ్చేలా కొట్టింది. అంతేకాదు నాకు సైడ్ ఇవ్వడా అంటూ దుర్బాషలాడింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలో ఓ యువతి ఉన్మాదిగా మారింది.. ఓ ఆటోవాలాను పబ్లిక్ గా హాకీ కర్రతో రక్తం వచ్చేలా పొట్టు పొట్టు కొట్టింది. ఈ ఘటన ఢిల్లీలోని నిహాల్ విహార ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వీడియోలో ఉన్న ప్రకారం.. స్కూల్ పిల్లలను తీసుకొని వెళ్తున్న ఓ ఆటోవాలా ట్రాఫిక్ జామ్ కావడంతో ఆగిపోయాడు. అతని వెనుక నుంచి బుల్లెట్ పై వస్తున్న యువతి ఆటో అడ్డు తప్పుకోవాలని పలుమార్లు హారన్ కొట్టింది. అయితే.. ఆటోవాలా తప్పుకోకపోవడంతో ఒక్కసారూ సైకోగా మారింది. తన వద్ద ఉన్న హాకీ స్టిక్ తో ఆటోను పక్కకు తొలగించవా అంటూ తలపై బాదింది. బండబూతులు తిడుతూ ఇష్టానుసారంగా కొట్టింది.

ఆ యువతి దెబ్బలకు ఆటోవాలకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. పక్కనే ఉన్న స్థానికులు రంగంలోకి దిగి అతన్ని కాపాడారు. యువతిపై ఫైర్ అయ్యారు.  ఈ భయానక దృశ్యం అక్కడే ఉన్న స్థానికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో క్షణాల్లో వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.. ఆ యువతి తాగి వచ్చి ఇలాంటి పని చేసిందని, ఇలాంటి ఉన్మాదులు బయట కాదు.. జైల్లో ఉండాలని కొందరు, అమ్మాయిలు ఇలా రెచ్చిపోతే పోలీసులు ఏం చేస్తున్నారు? అంటూ కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో రీ ట్వీట్ చేస్తూ ఢిల్లీ పోలీసులకు ట్యాగ్ చేశారు.

Show comments