Father Treatment For Daughter Reel: రీల్స్: ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండాల్సింది.. కూతుర్ని బెల్టుతో చితకబాదిన తండ్రి

రీల్స్: ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండాల్సింది.. కూతుర్ని బెల్టుతో చితకబాదిన తండ్రి

Father Treatment For Daughter Reel: రీల్స్ మోజులో పడి వైరల్ అవ్వడం కోసం, ఫేమస్ అవ్వడం కోసం ఏది పడితే అది చేస్తామంటే సమాజం చూస్తూ ఊరుకోదు. సమాజం ఊరుకున్నా ఇంట్లో వాళ్లకు తెలిస్తే అస్సలు ఊరుకోరు. ఈ విషయంలో వారి పరువు తీస్తే పెద్దవాళ్ళు బెల్టు తీస్తారు. తాజాగా ఓ అమ్మాయి విషయంలో అదే జరిగింది.

Father Treatment For Daughter Reel: రీల్స్ మోజులో పడి వైరల్ అవ్వడం కోసం, ఫేమస్ అవ్వడం కోసం ఏది పడితే అది చేస్తామంటే సమాజం చూస్తూ ఊరుకోదు. సమాజం ఊరుకున్నా ఇంట్లో వాళ్లకు తెలిస్తే అస్సలు ఊరుకోరు. ఈ విషయంలో వారి పరువు తీస్తే పెద్దవాళ్ళు బెల్టు తీస్తారు. తాజాగా ఓ అమ్మాయి విషయంలో అదే జరిగింది.

ఈ మధ్య కాలంలో రీల్స్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. తల్లిదండ్రులు కూడా పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చేస్తున్నారు. లైఫ్ లో సెటిల్ అవ్వకపోయినా గానీ ఇన్ స్టాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి లైఫ్ సెటిల్మెంట్ రా అని హామీ ఇచ్చేస్తారు. రీల్స్ కోసం పిచ్చి పిచ్చి స్టంట్ లు చేస్తుంటారు. ఎలా అయినా వైరల్ అయిపోవాలి అని చెప్పి తప్పుడు పనులు చేసేందుకు కూడా వెనకాడట్లేదు. ఈ విషయంలో అమ్మాయిలు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. అబ్బాయిలతో కలిసి రొమాన్స్ చేస్తూ రీల్స్ చేయడం.. బూతులు మాట్లాడడం.. రెచ్చిపోయి ప్రవర్తించడం వంటివి చేస్తూ తల్లిదండ్రుల ఆగ్రహానికి గురవుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం పిచ్చి పిచ్చి పనులు చేస్తే చూస్తూ ఊరుకోరు.

రీల్స్ మోజులో పడి ఓ అమ్మాయి చేసిన పనికి వాళ్ళ నాన్న ఆమె ఇంటికొచ్చాక చావగొట్టి చెవులు మూశాడు. అసలు అంతలా ఆ తండ్రి అంతలా చావగొట్టాడనికి ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? పశ్చిమ బెంగాల్ కి చెందిన ఓ యువతి.. ఫేమస్ అవ్వడం కోసం సిగరెట్ తాగుతూ ఒక రీల్ చేసింది. ఆ రీల్ ని ఇన్స్టాలో అప్ లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియో తండ్రి దృష్టిలో పడింది. ఇంకేముంది.. రోడ్డు మీద సిగరెట్ తాగుతూ అందరి ముందు పరువు తీస్తావా అంటూ బెల్టు తీశాడు. బెల్టుతో ఆ అమ్మాయిని చితకబాదాడు. ఈ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది తండ్రిని సమర్థిస్తుండగా.. మరి కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

వయసులో ఉన్న కూతురి మీద చేయి చేసుకోవడం ఏంటని.. అది చాలా తప్పని కామెంట్స్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం అమ్మాయి చేసింది తప్పని.. ఆ తప్పుకి కరెక్ట్ శిక్ష తండ్రి వేశాడని కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంచి పని చేశారు సార్ అని ఒకరు, బాధ్యత గల తండ్రి, మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ శిక్షకి ఆ అమ్మాయి అర్హులు అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు. పెంచిన తండ్రికి తప్పు చేసే పిల్లలను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని.. అతని తప్పు లేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? రోడ్డు మీద సిగరెట్ తాగుతూ రీల్స్ చేసిన కూతురికా? కూతురిని బెల్టుతో చితకబాదిన తండ్రికా? ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments