అక్కే అమ్మగా మారింది.. తమ్ముడి కోసం జీవితాన్నే ధారపోస్తున్న మహిళ కథ!

Brother And Sister Emotinal Story: ఈరోజుల్ల డబ్బుకోసం కన్న తల్లిదండ్రులనే రోడ్డున పడేస్తున్నారు. రూ.కోట్లకు కొద్దీ ఆస్తులు ఇచ్చినా ఆశ్రమాలకు పంపిస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఒక అక్క తన తమ్ముడి కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది.

Brother And Sister Emotinal Story: ఈరోజుల్ల డబ్బుకోసం కన్న తల్లిదండ్రులనే రోడ్డున పడేస్తున్నారు. రూ.కోట్లకు కొద్దీ ఆస్తులు ఇచ్చినా ఆశ్రమాలకు పంపిస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఒక అక్క తన తమ్ముడి కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది.

ఈరోజుల్లో మానవ సంబంధాలు అన్నీ లాభం- నష్టం అనే త్రాసులోకి వచ్చేశాయి. తమకు నష్టం వాటిల్లుతుంది అంటే కన్నవాళ్లు, తోబుట్టువులను కూడా ఉపేక్షించడం లేదు. కోట్లకి కోట్లు ఆస్తులు రాసిచ్చి కూడా ఆశ్రమాల్లో మగ్గుతున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఆస్తి కోసం తోబుట్టువులను రోడ్డున పడేసిన హేమాహేమీలు కూడా లెక్కకు మించే ఉన్నారు. ఇలాంటి రోజుల్లో తమ్ముడి కోసం ఒక అక్క తన జీవితాన్నే త్యాగం చేసింది అంటే నమ్ముతారా? తమ్ముడినే తన కొడుకుగా భావిస్తూ పెంచుకుంటోంది అంటే నమ్మగలరా? శీతల్ మోదీ కథ విన్న తర్వాత నమ్మాల్సిందే. ఆమె తన తోడ పుట్టిన తమ్ముడి కోసం పెళ్లి కూడా చేసుకోకుండా అతడికి తల్లిగా మారింది. తన తమ్ముడి కోసమే జీవిస్తోంది. వాళ్ల కథ వింటే ఆమె అక్క కాదు.. అమ్మ అని మీరే అంటారు.

ఇప్పుడు చెప్పుకుంటున్న 51 ఏళ్ల శీతల్ మోదీ గుజరాత్ రాష్ట్రంలోని అంకలేశ్వర్ లో ఉంటారు. ఆమె తన తమ్ముడు అశ్విన్ మోదీతో కలిసి జీవిస్తోంది. అశ్విన్ వయసు 48 ఏళ్లు. శరీరం ఎంత ఎదిగినా కూడా అతడు కేవలం 6 నెలల చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా చేయడానికి కారణం అతని శరీరం, వయసుకు తగినట్లుగా మెదడు ఎదగపోవడమే అని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా పదే పదే అశ్విన్ తన తల మీద కొట్టాలని అడుగుతాడు. అతనే తన తలను గోడలకు వేసి కొట్టుకుంటాడు. అలా ఎందుకు చేస్తాడు అని తెలుసుకోవడానికి శీతల్ చాలామంది వైద్యులను సంప్రదించారు. ఎంత మంది న్యూరాలజిస్టులను సంప్రదించినా కూడా అతని మెదడులో ఎలాంటి ట్యూమర్ లేదని తేల్చారు. చిన్న పిల్లల మనస్తత్వం కావడంతో అలా చేస్తున్నాడని అని వైద్యులు తెలిపారు.

ఇంక అశ్విన్ కోసం శీతల్ తన జీవితాన్నే త్యాగం చేశారు. ఎవరినైనా వివాహం చేసుకుంటే తన తమ్ముడిని చూసుకోవడం కుదరదేమో? ఒకవేళ ఎవరైనా వస్తే తన తమ్ముడిని చూసుకోలేకపోవచ్చు అనే భయంతో ఆవిడ అసలు పెళ్లి కూడా చేసుకోలేదు. ఆమె తన ఉద్యోగాన్ని కూడా మానుకోవాల్సి వచ్చింది. శీతల్ తన తల్లిదండ్రులు మరణానికి ముందు బ్యాంకు లో క్లర్క్ గా చేసేది. కానీ, తల్లిదండ్రుల మరణం తర్వాత తమ్ముడిని దగ్గరుండి చూసుకునేందుకు క్లర్క్ ఉద్యోగాన్ని మానేశారు. ఆ తర్వాత ఆవిడ బ్యూటీషన్ కోర్సు నేర్చుకున్నారు. డబ్బు సంపాదన కోసం అలా ఇంట్లోనే బ్యూటీపార్లర్ రన్ చేస్తున్నారు.

అశ్విన్ నిద్ర లేచిన దగ్గర నుంచి తిరిగి నిద్రపోయే వరకు ప్రతి పని శీతల్ మోదీనే చేసి పెట్టాలి. పొద్దున్నే నిద్రలేపడంతో కాలకృత్యాలు తీర్చడం, షేవింగ్ చేయడం కూడా శీతలే చేస్తారు. అలాగే కాస్త గట్టిగా ఉన్న పదార్థాలను కూడా అశ్విన్ నమలలేడు. ఏదైనా గట్టిగా ఉంటే శీతల్ నమిలి అశ్విన్ కి పెడతారు. ఇలా ప్రతి విషయంలోనూ శీతల్ తన తమ్ముడిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. అయితే శీతల్ ఆరోగ్యం కూడా అంత మెరుగ్గా ఏమీ లేదు. ఆమెకు విటమిన్ బీ12, కాల్షియం వంటి లోపాల కారణంగా ఊరికే అలిసిపోతున్నారంట. వైద్యులు విశ్రాంతి అవసరం అని సూచించారు. కానీ, విశ్రాంతి తీసుకుంటే తన తమ్ముడి బాగోగులు ఎవరు చూసుకుంటారు? డబ్బు ఎలా వస్తుంది అని.. శీతల్ తన పార్లర్ ని కంటిన్యూ చేస్తున్నారు. తమ్ముడికి అమ్మగా మారిన ఈ అక్క కథ ఈరోజుల్లో ఎంతో మందికి స్ఫూర్తి అనే చెప్పాలి. కేవలం డబ్బు కోసం బంధాలు, బంధుత్వాలు దూరం చేసుకుంటున్న వారికి ఈ అక్కాతమ్ముళ్ల కథ కనువిప్పు అవుతుంది. తమ్ముడికి అమ్మగా మారిన ఈ అక్క మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments