iDreamPost
android-app
ios-app

కారుకు ఘనంగా అంత్యక్రియలు చేసిన కుటుంబం.. ఏకంగా రూ. 4 లక్షలతో..

Garand Funeral For A Old Car: ఓ కుటుంబం కారుకు అంత్యక్రియలు చేసి వార్తల్లో నిలిచింది. ఏకంగా రూ. 4 లక్షలు ఖర్చు చేసి కారును ఖననం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

Garand Funeral For A Old Car: ఓ కుటుంబం కారుకు అంత్యక్రియలు చేసి వార్తల్లో నిలిచింది. ఏకంగా రూ. 4 లక్షలు ఖర్చు చేసి కారును ఖననం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

కారుకు ఘనంగా అంత్యక్రియలు చేసిన కుటుంబం.. ఏకంగా రూ. 4 లక్షలతో..

ప్రతి ఒక్కరికి ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఏదైనా వ్యాపారం చేసినప్పడు బాగా కలిసొచ్చిందంటే అందుకు కారణమైన వ్యక్తులను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. ఇదే విధంగా కొందరు బ్రతుకుదెరువు కోసం వ్యాన్లు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్స్ కొనుగోలు చేస్తుంటారు. వాటిపైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఆ వెహికల్స్ ను ఇంట్లో వ్యక్తిలాగానే భావిస్తుంటారు. వారి వాహనాలను అపురూపంగా చూసుకుంటుంటారు. ఇక ఈ వాహనాల వల్ల ఆర్థికంగా బాగా స్థిరపడితే వాటిని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు. వారి అభివృద్ధికి కారణమైన ఆ వాహనాన్ని ఏళ్ల తరబడి తమతోనే ఉంచుకుంటారు.

అది పాతబడినా సరే పాత ఇనుపసామానుకు మాత్రం వేయరు. షెడ్డులోనే భద్రంగా పదిలపరుచుకుంటారు. తరతరాలు గుర్తుండిపోయేలా ఏర్పాటు చేసుకుంటారు. ఇదే విధంగా ఓ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. వ్యాపారంలో సక్సెస్ అయినందుకు దానికి కారణమైన కారుకు కృతజ్ఞతగా గురువారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా వాస్తవంగా జరిగిన సంఘటనే ఇది. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఓ కుటుంబం కారుకి అంత్యక్రియలు చేసి అందరి దృష్టినీ తమ వైపునకు తిప్పుకుంది. ఏకంగా రూ. 4 లక్షలు ఖర్చు చేసి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది తెలిసిన వారు మనుషులకు, మూగ జీవాలకు అంత్యక్రియలు చేయడం చూశాం గానీ.. ఇలా కారుకు అంత్యక్రియలు చేయడం ఏంటనీ ఆశ్చర్యపోతున్నారు.

కారు అంత్యక్రియలకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. అసలు కారుకు అంత్యక్రియలు చేయడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. పదర్‌షింగా గ్రామంలో నివసించే సంజయ్‌ పోలారా కుటుంబం 12 ఏళ్ల క్రితం వ్యాగన్ ఆర్ కారును కొన్నది. దాన్ని కొన్నాక వారికి బాగా కలిసొచ్చింది. అయితే ఆ కారు పాతబడి పోవడంతో దాన్ని అమ్మేందుకు ఇష్టపడని ఆ కుటుంబం సమాధి చేయాలని భావించింది. అందుకోసం రూ.4 లక్షలు ఖర్చు పెట్టారు. భవిష్యత్ తరాలకు ఈ విషయం గుర్తుండాలని భావించి కారును గోతిలో పూడ్చిపెట్టినట్టు తెలిపారు. ఆ కుటుంబం తమ పొలంలోనే హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించింది.

కారును పుష్పాలతో అలంకరించి, వారి ఇంటి నుంచి పొలం వరకు అంతియ యాత్రను నిర్వహించారు. మంత్రోచ్ఛారణల మధ్య ఆ కారును 15 అడుగుల గోతిలో ఖననం చేశారు. కారు యజమాని సంజయ్ పొలారా మాట్లాడుతూ.. ఆ కారు తమకు సంపద తీసుకొచ్చిందని అన్నారు. ఆ కారు కారణంగా తమకు వ్యాపారంలో విజయం లభించిందని తెలిపారు. ఈ కారణంతోనే దానికి సమాధిని నిర్మించి నివాళులు అర్పించాలని భావించి ఈ పని చేసినట్లు చెప్పారు. కారు అంత్యక్రియల్లో వందలాదిమంది పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరి కారుకు అంత్యక్రియలు చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.