కోల్‌కతా డాక్టర్‌ కేసు: ED విచారణలో భయంకరమైన నిజాలు బయటికి!

Kolkata Doctor Case: కోల్‌కొతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగింది. ఈ సంఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సామాన్యులు, వైద్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఆమెకు న్యాయం జరగాలని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు.

Kolkata Doctor Case: కోల్‌కొతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగింది. ఈ సంఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సామాన్యులు, వైద్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఆమెకు న్యాయం జరగాలని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు.

దేశంలో గత కొంత కాలంగా మహిళలకు భద్రత లేకుండా పోతుంది. ఒంటరిగా కనిపించే ఆడవారిపై కామాంధులు లైంగికంగా వేదించడం, అత్యాచారాలకు పాల్పపడటం జరుగుతుంది. కొంతమంది దుర్మార్గులు తమ గుట్టు బయటపడుతుందని హత్యలకు పాల్పపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గత నెల ఆగస్టు 9న కోల్‌కొతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ఓ ట్రైనీ డాక్టర్ అత్యాచర, హత్య ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో మాజీ ప్రిన్సిపల్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే..

కోల్‌కొతా ఆర్‌జీ కర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కి సంబంధించిన అక్రమాలు తవ్వే కొద్ది వెలుగులోకి వస్తున్నాయి. ట్రైనీ డాక్టర్ ఘటన నేపథ్యంలో సందీప్ ఘోష్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తుంది. ఇప్పటికే పలు మార్లు ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఆయన భార్య పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అధికారుల నుంచి సరైన అనుమతి లేకుండా రెండు స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు ఈడీ తెలిపింది. కాగా, ప్రిన్సిప‌ల్ గా కొనసాగిన సమయంలో సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పపడినట్లు కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోన ఆయన ఇళ్లతో పాటు బంధువుల నివాసాల్లో ఈడీ సోదాలు చేయగా దాదాపు అరడజను ఇళ్లు, ఫ్లాట్లు, ఫామ్ హౌజ్ లకు సంబంధించిన కీలక పత్రాలు లభ్యమైనట్లు ఈడీ తెలిపింది.

ముర్జిదాబాద్ లో ఒక ఫ్లాట్, కోల్‌కొతాలో మూడు ఫ్లాట్లు సహా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ లభ్యమైనట్లు ఈడీ అధికారులు తెలిపారు. 2021 సంవత్సరంలో డాక్టర్ సందీప్ ఘోష్ ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ హూదాలో కొనసాగారు. ఆ సమయంలో ఆయన సతీమణి డాక్టర్ సంగీతా ఘోష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమించినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలోనే సందీప్ ఘోష దంపతులు ఆర్థిక లావాదేవీల్లో అవినీతికి పాల్పపడి భారీ మొత్తంలో ఆక్రమ ఆస్తులను పోగేసుకున్నట్లు దర్యాప్తులో ఈడీ అధికారులు గుర్తించారు.  సందీప్ ఘోష్ కాలేజ్, ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది.

Show comments