nagidream
Did You Recognize: ఆయనకిప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఉంది. చాలా కింద నుంచి వచ్చి ఎదిగినటువంటి వ్యక్తి. నిరాడంబరత్వంలో ఆకాశం. అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం ఒకప్పుడు మరువేషాలు వేసుకుని తిరిగిన నాయకుడు. ఆయనెవరో గుర్తుపట్టారా?
Did You Recognize: ఆయనకిప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఉంది. చాలా కింద నుంచి వచ్చి ఎదిగినటువంటి వ్యక్తి. నిరాడంబరత్వంలో ఆకాశం. అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం ఒకప్పుడు మరువేషాలు వేసుకుని తిరిగిన నాయకుడు. ఆయనెవరో గుర్తుపట్టారా?
nagidream
రాజకీయం ఇదొక వైకుంఠపాళి ఆట. ఎక్కడానికి నిచ్చెనలు ఉన్నట్టే.. ఎక్కిన తర్వాత కరవడానికి పాములు ఎదురుచూస్తుంటాయి. ఆ పాములను దాటుకుంటూ (తొక్కుకుంటూ) ఎవరైతే ఎత్తుకి చేరుకుంటారో వాళ్ళే అసలైన విజేతగా పరిగణించబడతారు. ప్రస్తుతం ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కూడా అలాంటి వ్యక్తే. పేదరికం నుంచి ఎదుగుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇవాళ దేశం, ప్రపంచం మెచ్చుకోతగ్గ నాయకుడిగా ఎదిగారు. ఈ ఫోటో 1976వ సంవత్సరంలోది. ఎమర్జెన్సీ సమయం అది. 1975 నుంచి 1977 సంవత్సరాల మధ్య 21 నెలల పాటు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశం మొత్తం ఎమెర్జెన్సీ ప్రకటించారు. ఇందిరా గాంధీ సలహాతో అప్పటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జూన్ 25 1975న నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు.
ఆ ఎమెర్జెన్సీ సమయంలో తీసిన ఫోటోనే ఇది. 1976లో భారతీయ జన సంఘ్ వర్కర్ అయిన ఒక నాయకుడి ఫోటో ఇది. ఆర్ఎస్ఎస్ లో పని చేసిన వ్యక్తి. ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బయటకొస్తే అరెస్టులు చేసేవారు. దీంతో ఆర్ఎస్ఎస్ లో విధులను కొనసాగించడం కోసం మారువేషంలో వెళ్లేవారు. రకరకాల గెటప్ లు వేసుకుని పోలీసులకు అనుమానం రాకుండా తిరిగేవారు. అలా తిరిగిన వాళ్లలో నేటి నాయకుడు కూడా ఉన్నారు. సిక్కు వేషంలో, వేరే వేరే గెటప్స్ లో తిరుగుతూ అప్పట్లో విధులను కొనసాగించేవారు. ఆయన ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తి. కొంతమంది ద్వేషించవచ్చుగాక. కానీ కోట్లాది మంది ఆయనను అభిమానిస్తారు. దేశంలోనే కాకుండా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రపంచ నాయకులు సైతం ఆయనను ఇష్టపడతారు.
అలాంటి ఆయన ఈ స్టేజ్ కి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. పేదరికంతో పోరాడారు. ఛాయ్ వాలా నుంచి దేశానికి ప్రధానమంత్రి వరకూ ఆయన ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం. ఆయన మరెవరో కాదు ముచ్చటగా మూడోసారి ప్రధానిగా గెలిచిన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. 2014లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. రెండు టర్మ్ లు విజయవంతంగా కొనసాగి.. ఇప్పుడు మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయన వరుసగా మూడోసారి ప్రధాని అవ్వడం అంటే మామూలు విషయం కాదని పలువురు కొనియాడుతున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. రీసెంట్ గా వచ్చిన ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాలతో విజయం సాధించడంతో మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా గెలిచారు. ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసిన మోదీ.. జూన్ 8న శనివారం నాడు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.