Tirupathi Rao
Details About Bangladesh Student Leader Nahid Islam: ఈ 26 ఏళ్ల కుర్రాడు.. బంగ్లాదేశ్ అల్లర్లలో కీలక పాత్ర పోషించాడు. ఒకరకంగా హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి కూడా ఇతనే కారణం అంటున్నారు. అసలు ఎవరీ నహిద్ ఇస్తాం? అతని పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Details About Bangladesh Student Leader Nahid Islam: ఈ 26 ఏళ్ల కుర్రాడు.. బంగ్లాదేశ్ అల్లర్లలో కీలక పాత్ర పోషించాడు. ఒకరకంగా హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి కూడా ఇతనే కారణం అంటున్నారు. అసలు ఎవరీ నహిద్ ఇస్తాం? అతని పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Tirupathi Rao
బంగ్లాదేశ్ ప్రభుత్వం కూలిపోయింది. ప్రధాని రాజీనామా చేసి భారత్ లో తలదాచుకుంటున్నారు. వారి కుటుంబం పూర్తిగా రాజకీయాలను వీడ్కోలు పలికిన్నట్లు కూడా చెబుతున్నారు. విద్యార్థులు మొదలు పెట్టిన ఈ ఉద్యమంలో.. 300 మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా.. దేశం మొత్తం అతలాకుతలం అయిపోయింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఒక 26 ఏళ్ల కుర్రాడు బాగా హైలెట్ అవుతున్నాడు. అతని వల్లే బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా కూలపోయింది అంటున్నారు. ఈ ఉద్యమంలో జైలుపాలై.. పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు కూడా తిన్నాడు. కానీ, వెనకడుగు వేయకుండా నిలబడి పోరాడి ప్రభుత్వాన్నే దింపేశాడు అంటున్నారు. ఆ కుర్రాడు ఎవర? అతని బ్యాగ్రౌండ్ ఏంటో చూద్దాం.
ఇప్పుడు చెప్పుకుంటున్న కుర్రాడి పేరు నహిద్ ఇస్లాం. నుదుటిన బంగ్లాదేశ్ జెండాను కట్టుకుని.. ఉద్యమంలో చాలాచోట్ల కనిపించాడు. ఈ 26 ఏళ్ల కుర్రాడిని పోలీసులు ఒకసారి అరెస్టు కూడా చేశారు. ఇతని సోదరుడు చెప్పిన వివరాల ప్రకారం.. నహిద్ ని స్పృహ కోల్పోయేదాకా కొట్టి రోడ్డు మీద పడేశారు అని ఆరోపించాడు. కానీ, వెనకడుగు వేయకుండా నహిద్ తన పోరాటాన్ని కొనసాగించాడని చెప్పారు. తరచూ మీడియాకి కనిపిస్తూ వచ్చాడు. అతనే ఈ ఆందోళనలను సమన్వంయ చేస్తూ వచ్చాడు. ఆఖరికి బంగ్లాదేశ్ ప్రభుత్వం మారిపోయే స్థాయికి అతను ప్రభావం చూపించగలిగాడు. ఇతను ఢాకా విశ్వవిద్యాలయంలో సోషయాలజీ విద్యార్థి. అతనే ఈ ఏడాది జులై నెలలో కొందరు స్టూడెంట్స్ తో కలిసి తొలిసారి రిజర్వేషన్లపై ఉద్యమానికి దిగి.. అరెస్టు కూడా అయ్యాడు. ఆ తర్వాత బంగ్లా ప్రజలు అతడిని తరచూ చూస్తూ వచ్చారు. ఎందుకంటే ఆ ఉద్యమాన్ని ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాడు. ఆఖరికి షేక్ హసీనా రాజకీయ జీవితాన్నే శాసించాడు.
మంగళవారం సాయంత్రం నహిద్, మిగిలిన విద్యార్థి నాయకులు కూడా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ తో భేటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్ బంగ్లాదేశ్ లో రాబోయే ప్రభుత్వానికి సంబంధించి ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే విద్యార్థులు సైన్యం పాలనను గానీ.. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని గానీ అంగీకరించలేదు. వాళ్ల డిమాండ్ ఏంటంటే.. నోబెల్ బహుమతి గ్రహీత్ మహమ్మద్ యూనిస్ ని చీఫ్ అడ్వైజర్ గా ప్రభుత్వం తీసుకోవాలి అని కోరుతున్నారు. అలాగే విద్యార్థి ఉద్యమం ఆమోదం పొందకుండా ఏ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు అని కూడా వాళ్లు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇంక నహిద్ వ్యక్తిగత వివరాలు చూస్తే.. ఇతను 1998లో ఢాకాలోనే జన్మించాడు. అతని తండ్రి ఒక టీచర్. నహిద్ సోదరుడు ఇప్పుడు అతనితోపాటే ఉద్యమంలో భాగం అయ్యాడు. తన సోదరుడు బంగ్లాదేశ్ లో మార్పు రావాలని కోరుకునే వారిలో ముందుంటాడని చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారిపోయేలా చేశాడు అని చెబుతున్న ఈ నహిద్ ఇస్లాం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.