రీల్స్ పిచ్చితో ఎంతకు తెగించిందంటే!

Delhi Crime News: ఈ మధ్య కాలంలో చిన్న పెద్దా తేడా లేకుండా చాలా మంది రీల్స్, వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. రీల్స్ కోసం దేనికైనా తెగబడుతున్నారు.

Delhi Crime News: ఈ మధ్య కాలంలో చిన్న పెద్దా తేడా లేకుండా చాలా మంది రీల్స్, వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. రీల్స్ కోసం దేనికైనా తెగబడుతున్నారు.

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి జనాలు ప్రతి విషయంలో అప్‌డేట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి రక రకాల రీల్స్, వీడియోలు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతూ.. రాత్రికి రాత్రే స్టార్స్ అవుతున్నారు. కొన్ని రీల్స్, వీడియోలు ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉన్నా.. కొన్ని మాత్రం షాకింగ్ గురిచేసేలా ఉంటున్నాయి. కొంతమంది వీడియోలు, రీల్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఎదుటి వారిని ఇబ్బందులకు గురి చేయడమే కాదు.. తమ ప్రాణాలకు కూడా రిస్క్‌లో పెడుతున్నారు. ఓ మహిళా యూట్యూబర్ రీల్స్ పిచ్చితో చేసిన పని ఆమె కొంప ముంచింది. వివరాల్లోకి వెళితే..

ఆమెకు రీల్స్, వీడియోలు చేయాలంటే ఎంతో ఇష్టం. తన యూట్యూబ్ ఛానెల్, ఇన్‌స్ట్రాగ్రాంలో వీడియోలు చేసి తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకోవాలన్న ఆశ ఉండేది. ఇందుకోసం మంచి కెమెరా ఉండాలి.. అలాంటి కెమెరా కొనాలంటే డబ్బు అవసరం. ఆ డబ్బు కోసం చేయరాని తప్పు చేసి అడ్డంగా పోలీసులకు బుక్కయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నీతూ యాదవ్ అనే మహిళ తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు తీసి అప్ లోడ్ చేయడానికి మంచి కెమెరా కొనుగోలు చేయాలనుకుంది. తెలిసిన వాళ్లను సంప్రదించగా నికాన్ DSLR కెమెరా మంచి క్లారిటీ ఉంటుందని చెప్పడంతో దాన్ని కొనాలని డిసైడ్ అయ్యింది. ఇందుకోసం తాను పని చేస్తున్న ఇంట్లో బంగారం, వెండి ఆభరణాలు దొంగతనం చేసి ఉడాయించింది. నగలు పోయినప్పటి నుంచి నీతూ యాదవ్ కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ని క్షుణ్ణంగా పరిశీలించారు. చోరీ చేసిన తర్వాత ఆమె ఏ ఏ లోకేషన్లలో తిరిగిందన్న విషయం సీసీ‌టీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకొని ఢిల్లీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పట్టుకొని అరెస్ట్ చేశారు. విచారణలో  తనది రాజస్థాన్ అని.. పెళ్లైనప్పటి నుంచి భర్త వ్యసనాలకు భానిసై తనను కొట్టి వేధించేవాడని, అది తట్టుకోలేక ఢిల్లీకి వచ్చి తాను పనిచేస్తున్న యజమాని ఇంట్లో చేరినట్లు తెలిపింది. ఇటీవల యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇన్‌స్ట్రాగ్రాంలో వీడియోలు తాను చేసిన రీల్స్ అప్ లోడ్ చేసినట్లు తెలిపింది.తన వీడియోలకు లైక్స్ బాగా వస్తున్నాయని.. మరింత క్వాలిటీగా చేస్తే ఇంకా మంచి పేరు వస్తుందని ఎవరో సలహా ఇస్తే నికాన్ కెమెరా కొనేందుకు డబ్బులే లేక తాను పనిచేస్తున్న యజమాని ఇంట్లో నగలు దొంగతనం చేసి అవి అమ్మి ఆ డబ్బుతో కెమెరా కొనాలని ప్లాన్ చేసినట్లు నీతూ యాదవ్ చెప్పింది. రీల్స్ వ్యామోహంలో పడి జీవితాన్ని చేతులారా చిక్కుల్లోకి నెట్టుకుంది.

Show comments