హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపులే!

మీరు ఎవరినైనా డార్లింగ్ అని పిలుస్తున్నారా? డార్లింగ్ అని పిలిచే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. లేదంటే ఇబ్బందులు తప్పవు. డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపుల కిందికే వస్తుందని హైకోర్టు తీర్పునిచ్చింది.

మీరు ఎవరినైనా డార్లింగ్ అని పిలుస్తున్నారా? డార్లింగ్ అని పిలిచే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. లేదంటే ఇబ్బందులు తప్పవు. డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపుల కిందికే వస్తుందని హైకోర్టు తీర్పునిచ్చింది.

సాధారణంగా మనసుకు ఇష్టమైన వారిని డార్లింగ్ అని పిలవడం వింటుంటాం. ప్రియురాలిని, భార్యను ఇంకా ఇతరులను డార్లింగ్ అని ముద్దుగా పిలుస్తుంటారు. అయితే మీరు కూడా ఎవరినైనా డార్లింగ్ అని పిలుస్తున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే. నోటి నుంచి జారిన మాట, విల్లు నుంచి వదిలిన బాణం తిరిగి రావు అంటుంటారు కదా. ఇకపై డార్లింగ్ అని పిలచే ముందు ఆలోచించాల్సిందే. లేదంటే కటకటాలపాలు కావాల్సి వస్తుంది. డార్లింగ్ అని పిలవడంపై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందంటూ కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. పరిచయం లేని అమ్మాయిలను డార్లింగ్ అని పిలవడం లైగింక వేధింపు కిందకే వొస్తుంది అంటూ కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. డార్లింగ్ అని పిలిచిన వారిని 354ఏ, 509 కింద నిందుతులగా భావించొచ్చు అని హైకోర్టు పేర్కొంది. ఒక వ్యక్తి తెలియని మహిళను డార్లింగ్ అని పిలిచాడు. దీన్ని అగౌరవంగా భావించిన ఆమె పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఈ కేసు హైకోర్టుకు చేరింది. దీనిపై విచారణ చేసిన కలకత్తా హైకోర్టు షాకింగ్ తీర్పును వెల్లడించింది. తెలియని మహిళను ‘డార్లింగ్’ అని పిలవడం సరికాదని, దానిని వేధింపుగా పరిగణిస్తామని హైకోర్టు పేర్కొంది.

భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 354ఏ(ఐ) ప్రకారం ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించవచ్చని తెలిపింది. అసలు ఏం జరిగిందంటే? దుర్గాపూజ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఓ పోలీసు బృందం లాల్‌ తిక్రీకి బయలు దేరింది. ఈ క్రమంలో అక్కడున్న ఓ వ్యక్తి మహిళా పోలీసును డార్లింగ్ అని పిలిచాడు. అతడిపై మాయాబందర్ పోలీస్ స్టేషన్ లో మహిళా పోలీస్ కేసు నమోదు చేశారు. కేసును విచారించిన తర్వాత కలకత్తా హైకోర్టు తీర్పును వెలువరించింది. ‘ఆమె పోలీసు అయినా కాకపోయినా, వీధిలో తెలియని మహిళను ‘డార్లింగ్’ అని పిలవడం అవమానకరమైన వ్యాఖ్య అని తెలిపింది. మహిళలపట్ల అసభ్య పదాలను ఉపయోగించడం శిక్షార్హమని జస్టిస్ సేన్‌గుప్తా అన్నారు.

Show comments