వీడియో.. అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 58 మందికి గాయాలు

వీడియో.. అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 58 మందికి గాయాలు

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఓ బస్సు మూల మలుపు వద్ద అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 58 మంది గాయపడ్డారు.

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఓ బస్సు మూల మలుపు వద్ద అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 58 మంది గాయపడ్డారు.

ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో అడ్డుకట్టపడడం లేదు. అతివేగం ప్రమాదకరమని చెబుతున్నప్పటికీ కొందరు డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నప్పటికీ కొంతమంది డ్రైవర్లలో మార్పు రావడం లేదు. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో ఘెర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం.

పరిమితికి మించిన స్పీడుతో వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు వాహనదారులు. తాజాగా మహారాష్ట్రలోని నాసిక్ లో ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. నాసిక్‌లోని సాత్పురా ఘాట్ రోడ్ లో ఓ మూల మలుపు వద్ద ఓవర్టేక్ చేసే క్రమంలో ఘోరం జరిగింది. బస్సును కంట్రోల్ చేయలేక డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో లోయలో పడిపోయింది. దీంతో ప్రయాణికులంతా ప్రాణభయంతో వణికిపోయారు. ఆ ప్రాంతమంతా అరుపులు కేకలతో దద్దరిల్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. 58 మందికి గాయాలయ్యాయి. ఇది గమనించిన వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Show comments