బెంగుళూరులో మిస్ అయిన బాలుడు.. 3 రోజుల తరువాత హైదరాబాద్ లో!

సోషల్ మాద్యమాలు వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా సీడ్ అయ్యింది. ముఖ్యంగా పోలీసులకు కొన్ని కేసులు ఛేదించడంలో సోషల్ మాధ్యమాలు కీలకంగా మారుతున్నాయి.

సోషల్ మాద్యమాలు వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా సీడ్ అయ్యింది. ముఖ్యంగా పోలీసులకు కొన్ని కేసులు ఛేదించడంలో సోషల్ మాధ్యమాలు కీలకంగా మారుతున్నాయి.

సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు చాలామంది సెలబ్రెటీలు అవుతున్నారు. కొన్ని వీడియోలో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.  సోషల్ మాధ్యమాల ద్వారా ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మిస్సింగ్ కేసుల విషయంలో సోషల్ మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మరోసారి రుజువైంది. గతంలో పలు మిస్సింగ్ కేసులు, అంతు చిక్కని కేసులు సైతం సోషల్ మాధ్యమాలైన యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ఫోటోలు, సమాచారం పంపించడం వల్ల కీలకమైన కేసులను పోలీసులు ఛేదించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ మిస్సింగ్ కేసు మూడు రోజుల తర్వాత పోలీసులు చేదించారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్ణాటక రాజధాని బెంగుళూరు లో 12 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు నేషనల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ క్రమంలోనే బాలుడిని హైదరాబాద్ లో బుధవారం నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద గుర్తించారు. సోషల్ మీడియా సాయంతో బాలుడి ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రుల ఆనందంలో మునిగిపాయారు. అసలు ఏం జరిగిందంటే.. బెంగుళూరు కు చెందిన ప్రణవ్ (12) గుంజూర్‌లోని డీన్స్ అకాడమీలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం కోచింగ్ సెంటర్ కి అని ఉదయం బయలుదేరాడు. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే కావేరీ ఆస్పత్రి లో అమర్చిన సీసీ టీవీ కెమెరాలో బాలుడిని చివరిగా చూశారు పోలీసులు. బాలుడు మిస్ అయిన సమయానికి అతని వద్ద డబ్బులు, మొబైల్ లేవు.

పోలీసులు బాలుడి కోసం వెతకడం మొదలు పెట్టారు.. ప్రతిచోట సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా పట్టుకునే ప్రయత్నం చేసేలోగా అక్కడ నుంచి మరోచోటికి వెళ్లిపోయాడు బాలుడు. దీంతో సోషల్ మీడియాని రంగంలోకి దింపారు పోలీసులు. ప్రణవ్ పోస్టర్లు ఆన్ లైన్ లో సర్క్యులేట్ చేశారు. అన్ని సోషల్ మాద్యమాల ద్వారా బాబుకి సంబంధించిన వివరాలు పంపించారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం హైదరాబాద్ వచ్చిన ప్రణవ్ నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద ఏడుస్తూ పోలీసులకు కనిపించాడు. బెంగుళూరు నుంచి రైలులో మైసూర్ మీదుగా హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రణవ్ సమాచారం తల్లిదండ్రులకు అందడంతో సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాలుడు ఎలా మిస్ అయ్యాడు.. ఎందుకు మిస్ అయ్యాడు అన్న విషయంపై క్లారిటీ లేదు. బాలుడిని పట్టుకోవడంలో పోలీసులు చూపించిన చొరవపై తల్లిదండ్రులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రణవ్ మిస్ అయిన తర్వాత అతని తల్లి తిరిగి రావాలని కోరుతూ ఓ వీడియో చేసింది.. నిజంగా తల్లి ప్రేమనే ప్రణవ్ ని తిరిగి రప్పించిందని నెటిజన్లు అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Show comments