Tirupathi Rao
దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. దుర్గామాతా మండపాలకు భక్తులు పెద్దసంఖ్యలో చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక ఘోరం సంభంవించింది. అమ్మవారి మండపం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. దుర్గామాతా మండపాలకు భక్తులు పెద్దసంఖ్యలో చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక ఘోరం సంభంవించింది. అమ్మవారి మండపం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది.
Tirupathi Rao
దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దుర్గామాతా మండపాలకు భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నాయి. అయితే ఇలాంటి తరుణంగా దుర్గామాతా మండపం వద్ద దారుణం చోటుచేసుకుంది. బిహార్ లో దుర్గామాతా మండపం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికిపైగా గాయాలు అయ్యాయి. సోమవారం రాత్రి గోపాల్ గంజ్ లో ఈ విషాదం సంభవించింది.
సాధారణంగానే దుర్గామాతా శరన్నవరాత్రులు అంటే మండపాలకు భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తుతూ ఉంటారు. సోమవారం రాత్రి దేవీ నవరాత్రులు సందర్భంగా రాజా దళ్ ప్రాంతంలో దుర్గాపూజా వేడుకలు నిర్వహించారు. అమ్మవారి దర్శనార్థం భక్తులు పెద్దఎత్తున మండపానికి తరలివచ్చారు. మండపం వద్దకు ఒకేసారి పెద్దసంఖ్యలో భక్తులు చేరుకోవడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ దురదృష్టకర ఘటనలో అయిదేళ్ల బాలుడు, ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది భక్తులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై గోపాల్ గంజ్ పోలీసులు స్పందించారు.
ఎస్పీ స్వర్ణ ప్రభాత్ మాట్లాడుతూ.. “సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో రాజాదలళ్ పూజా పండల్ గేటు వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒక బాలుడు కింద పడిపోయాడు. అతడిని కాపాడేందుకు ఇద్దరు మహిళలు ప్రయత్నించారు. ఆ సమయంలో మహిళలు కూడా కిందపడిపోయారు. అప్పుడే ప్రసాదం కోసం భక్తులు గుమికూడటంతో తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో బాలుడు సహా మహిళలకు ఊపిరాడక స్పృహ కోల్పోయారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించేలోపే వాళ్లు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వారిని సదర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. మండపం వద్ద రద్దీని నియంత్రించేందుకు ఎలాంటి భద్రతా చర్యలు లేవు. అందుకే ఈ తొక్కిసలాట జరిగింది”అంటూ ఎస్పీ వెల్లడించారు.
Bihar | Three people including two women and a child were killed during a stampede in a puja pandal in Gopalganj. The magistrate and police force are present at the spot: Gopalganj Police pic.twitter.com/Bc5YM0RGtZ
— ANI (@ANI) October 23, 2023