Nidhan
అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది. అయితే బాలరాముడి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా విశాఖలో సముద్రం నీటి అడుగున కొందరు డైవర్లు సాహసం చేశారు.
అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది. అయితే బాలరాముడి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా విశాఖలో సముద్రం నీటి అడుగున కొందరు డైవర్లు సాహసం చేశారు.
Nidhan
కోట్లాది మంది రామ భక్తుల వందల ఏళ్ల కల సోమవారంతో తీరిపోయింది. ఎట్టకేలకు అయోధ్య భవ్య మందిరంలో బాలరాముడు కొలువు దీరాడు. రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది. అభిజిల్లగ్నంలో శ్రీరాముడి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారు ప్రధాని నరేంద్ర మోడీ. విగ్రహ కళ్లకు ఆచ్ఛాదనగా ఉన్న వస్త్రాన్ని పీఎం మోడీ తొలగించారు. ప్రాణ ప్రతిష్ట సమయంలో దేవాలయం మీద హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. ఆ టైమ్‌లో 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు మంగళ వాయిద్యాలు మోగించారు. ఇవాళ మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమైన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం 1 గంటలకు ముగిసింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో కలసి మోడీ ప్రత్యేక పూజలు చేశారు. వాళ్ల వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. అయితే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వైజాగ్ రుషికొండ బీచ్‌లో నీటి అడుగున డైవర్లు సాహసం చేశారు.
అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన వేళ ఈ శుభ సందర్భానికి గుర్తుగా విశాఖపట్నానికి చెందిన కొందరు డైవర్లు రేర్ ఫీట్ చేశారు. లైవ్ ఇన్ అడ్వెంచర్స్‌కు చెందిన డైవర్లు స్పెషల్‌గా డిజైన్ చేసిన బోర్డు మీద శ్రీరాముడి ఫొటోను సముద్రంలో నీటి అడుగున ప్రదర్శించారు. వైజాగ్‌లోని స్కూబా డైవింగ్ యూనిట్ ఈ వినూత్న ప్రయోగం చేసింది. రామయ్య చిత్రపటాన్ని తీసుకొని రుషికొండ సముద్రపు లోతుల్లోకి వెళ్లి ప్రదర్శించింది. ఈ వినూత్న ప్రయోగం మీద డైవర్లు స్పందించారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం వేళ తమ వంతుగా ఇలా ఈ కార్యక్రమలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సముద్రంలో నీటి అడుగున శ్రీరాముడి ఫొటోలను సందర్శించిన ఈ ప్రయోగానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ డైవర్ల సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. రామయ్య కోసం చాలా సాహసం చేశారని ప్రశంసిస్తున్నారు.
ఇక, రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీంతో నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. అయోధ్యలో ఎటు చూసినా రామనామ స్మరణతో మార్మోగింది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసిన రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశ, విదేశాల్లోని వీఐపీలు, స్వామీజీలు కలసి దాదాపు 7 వేల మంది విచ్చేశారు. సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్, చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్ దంపతులు అటెండ్ అయ్యారు. మరి.. రామయ్య కోసం వైజాగ్ డైవర్లు చేసిన సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
వైజాగ్ రుషికొండలో సముద్రపు అడుగున శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట
– 22 అడుగుల లోతులో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట..
– లైవిన్ అడ్వెంచర్ బృందం ఆధ్వర్యంలో నిర్వహణ..#SreeramaChandra #Vizag #Ayodhya #RamMandirPranPrathistha #rtv #rtvnews pic.twitter.com/ehxmqStQuJ
— RTV (@RTVnewsnetwork) January 22, 2024