బంగ్లాదేశ్ నుంచి భారత్ కు 3 వేల టన్నుల హిల్సా చేపలు.. వీటి ప్రత్యేకత ఏంటంటే?

Hilsa fish: బంగ్లాదేశ్ లో లభించే ప్రత్యేకమైన హిల్సా చేపలను భారత్ కు ఎగుమతి చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏకంగా 3 వేల టన్నుల ఎగుమతి చేయనున్నది. ఇంతకీ వీటి ప్రత్యేకత ఏంటంటే?

Hilsa fish: బంగ్లాదేశ్ లో లభించే ప్రత్యేకమైన హిల్సా చేపలను భారత్ కు ఎగుమతి చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏకంగా 3 వేల టన్నుల ఎగుమతి చేయనున్నది. ఇంతకీ వీటి ప్రత్యేకత ఏంటంటే?

చేపల్లో ఎన్నో రకాలు ఉంటాయి. బంగారు తీగ, రవ్వ, కొర్రమీను ఇలా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. పోషకాలతో కూడిన చేపలను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చేపల ధరలు కేజీకి వాటి రకాలను బట్టి 100 నుంచి 500 వరకు ఉంటుంది. చేపల్లో ఖరీదైన రకాలు కూడా ఉంటాయి. మీరంతా పులుస చేపల గురించి వినే ఉంటారు. గోదావరి నదిలో అరుదుగా లభ్యమయ్యే ఈ పులుస చేపల ధర కేజీ వేలల్లో ఉంటుంది. ఈ పులుస చేపల మాదిరిగానే బంగ్లాదేశ్ దేశంలో హిల్సా చేపలు ఫేమస్.

బంగ్లాదేశ్‌ లోని పద్మా నదిలో దొరికే చేపలు కాబట్టి వీటికి పద్మా పులస అనే పేరొచ్చింది. ప్రపంచంలోని దాదాపు 70 శాతం హిల్సాలు బంగ్లాదేశ్‌లోనే ఉత్పత్తి అవుతాయి. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో దొరికే ఈ హిల్సా చేపలను భారత్ కు ఎగుమతి చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంతకీ ఈ హిల్సా చేపల ప్రత్యేకత ఏంటీ? ఈ సమయంలో భారత్ కు ఎందుకు ఎగుమతి చేస్తున్నారు? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

బంగ్లాదేశ్ ప్రభుత్వం హిల్సా చేపల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసింది. త్వరలో 3 వేల టన్నుల హిల్సా చేపలను భారతదేశానికి ఎగుమతి చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2012లో తీస్తా నది నీటి భాగస్వామ్య ఒప్పందంపై భారత్‌కు, బంగ్లాకు మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ చేపల ఎగుమతిపై నిషేధం విధించింది. అరుదుగా దొరికే చేపలు కావడంతో స్మగ్లింగ్ ఎక్కువైపోయింది. దీంతో 2022లో బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేదాన్ని ఎత్తివేసింది. ఇటీవల షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది భారతదేశానికి హిల్సా చేపల ఎగుమతిపై నిషేధం విధించింది. ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.

హిల్సా ప్రత్యేకత ఏంటంటే?

మరి ఈ హిల్సా చేపలను భారత్ కు ఇప్పుడు ఎందుకు ఎగుమతి చేస్తున్నారనే సందేహం కలుగొచ్చు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ లో దేవీ నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో హిల్సా చేపలను దుర్గామాతకు నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. పోషకాలతో కూడి రుచికరంగా ఉండడంతో బెంగాల్ ప్రజలు వంట చేసుకుని తింటుంటారు. ఈ కారణంతో బంగ్లాదేశ్ భారత్ కు హిల్సా చేపలను ఎగుమతి చేస్తుంది. బెంగాలీల అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన దుర్గాపూజ సమయంలో హిల్సా చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కిలో హిల్సా ధర దాదాపు వెయ్యి రూపాయలు ఉంటుంది. దేవీ నవరాత్రుల్లో హిల్సా చేపలు కచ్చితంగా ఉండాల్సిందే అంటున్నారు బెంగాలీలు.

Show comments