ఈ స్టార్ డైరెక్టర్స్ ఈ నటులు లేకుండా సినిమాలు తీయడం అరుదు..!

ఈ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ఈ నటులు లేకుండా సినిమాలు తీయడం అరుదునే చెప్పాలి. ఫ్రెండ్ షిప్ లేదా సెంటిమెంటా లేక ఇతర కారణాలో తెలియదు కానీ.. ఈ నటీనటులు మాత్రం తమ సినిమాల్లో కనిపించాల్సిందే.

ఈ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ఈ నటులు లేకుండా సినిమాలు తీయడం అరుదునే చెప్పాలి. ఫ్రెండ్ షిప్ లేదా సెంటిమెంటా లేక ఇతర కారణాలో తెలియదు కానీ.. ఈ నటీనటులు మాత్రం తమ సినిమాల్లో కనిపించాల్సిందే.

ఈ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు తమ సినిమాల్లో కొంతమంది యాక్టర్లు లేకుండా సినిమాలు తీయడం చాలా అరుదు.. సెంటిమెంట్ లేక ఫ్రెండ్ షిప్పా తెలియదు కానీ తప్పకుండా కొంత మంది నటుల్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఫుల్ లెంత్ క్యారెక్టర్‌లో కాకపోయినా సరే చిన్న పాత్రలలోనైనా లేదా గెస్ట్ రోల్‌లోనైనా కనిపించాల్సిందే. ఆ దర్శకులెవరంటే మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్, అలాగే దర్శక ధీరుడు, పని రాక్షసుడు ట్యాగ్ లైన్ తీసుకున్న జక్కన్న అలియాస్ ఎస్ఎస్ రాజమౌళి, కేవలం మూడు చిత్రాలతోనే ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ నటీనటులు లేకుండా సినిమాలు తెరకెక్కించడం చాలా రేర్‌గా జరిగింది. ఇప్పటి వరకు వీరు తెరకెక్కించిన సినిమాల్లో ఈ యాక్టర్స్ కనిపిస్తూనే ఉన్నారు. ఇంతకు ఆ నటీనటులు ఎవరంటే.?

పమ్మి సాయి.. త్రివిక్రమ్ తెరకెక్కించిన 12 చిత్రాల్లో అడపా దడపా సినిమాలు తీసేస్తే అన్ని చిత్రాల్లోనూ కనిపిస్తాడు. అతడు మూవీ దగ్గర నుండి ఇటీవల వచ్చిన గుంటూరు కారం వరకు ఈ మాటల మాంత్రికుడు చిత్రాల్లో కనిపిస్తూనే ఉన్నాడు. కొన్ని సినిమాల్లో అలా వచ్చి ఇలా వెళ్లిపోయే క్యారెక్టర్స్ చేయగా.. మరి కొన్ని సినిమాల్లో మంచి రోల్స్‌తో ఆకట్టుకున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి, అఆ నుండి ప్రేక్షకులకు బాగా రిజిస్టర్ అయ్యాడు. కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాలే కాదు.. ఇతర దర్శకుల చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. వరుడు కావలెను చిత్రంలో బద్దకస్తుడైన పనోడిగా నటించి నవ్వులు, పువ్వులు పూయించాడు. ఇక దర్శక ధీరుడు జక్కన్న రాజమౌళి విషయానికి వస్తే.. ఇలాంటి సెంటిమెంట్‌నే ఫాలో అయ్యాడు. ఆయన కూడా ఇద్దరు నటుల్ని కంటిన్యూ చేస్తున్నాడు.

నటుడు చంద్ర శేఖర్ని మోస్ట్లీ అన్ని చిత్రాల్లోనూ కంటిన్యూ చేశాడు రాజమౌళి. బాహుబలి మినహాయించి అన్నింట్లోనూ శేఖర్ కనిపించాడు. బాహుబలి 2లో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిందని ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు శేఖర్. ఇక రాజీవ్ కనకాల కూడా రాజమౌళి ఫస్ట్ మూవీ స్టూడెంట్ నంబర్ వన్ నుండి ర్యాపో మెయిన్ టెయిన్ చేస్తున్నాడు. సింహాద్రి, బాహుబలి సిరీస్ మినహాయించి మిగిలిన చిత్రాల్లో నటించాడు. ఇక ఇటీవల కల్కి 2898 ఏడీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగ్ అశ్విన్ సైతం ఇద్దరు యాక్టర్లను తన తొలి సినిమా నుండి కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ ఇద్దరు ఎవరంటే.. విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, ఇప్పుడు కల్కిలో ఈ ఇద్దరు నటించిన సంగతి విదితమే. విజయ్‌తో స్నేహం వల్ల నాగీ మామ అతడ్ని కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తుంది. కల్కి 2లో కూడా ఈ ఇద్దరు ఉండబోతున్నారని వినికిడి.

Show comments