iDreamPost
android-app
ios-app

ఎఫ్3 బిజినెస్ టార్గెట్ పెద్దదే

  • Published May 23, 2022 | 6:46 PM Updated Updated May 23, 2022 | 6:47 PM
ఎఫ్3 బిజినెస్ టార్గెట్ పెద్దదే

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఎఫ్3 మీద క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ ఇద్దరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా వెంకటేష్ గత రెండు సినిమాలు ఓటిటిలో రావడంతో దగ్గుబాటి అభిమానులు ఇది చూసేందుకు తెగ ఎగ్జైట్ అవుతున్నారు. అడ్వాన్ బుకింగ్స్ మరీ భీకరంగా లేవు కానీ టాక్ ఖచ్చితంగా కుటుంబాలను థియేటర్ల దాక తీసుకొస్తుందనే నమ్మకాన్ని దిల్ రాజు వ్యక్తం చేస్తూ వచ్చారు. వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ మరోసారి కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అవుతోంది. ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో టీమ్ హుషారు చూసి అందరికీ నమ్మకం వచ్చేసింది. ఇక బిజినెస్ విషయానికి వస్తే ఫిగర్లు కొంచెం షాకింగ్ గానే అనిపిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 కోట్లకు ఎఫ్3 థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఇది పెద్ద మొత్తమే. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన ఎఫ్2కి ఇందులో సగానికి అమ్మితే డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు, టికెట్ రేట్లలో చాలా మార్పులు ఉన్నాయి కాబట్టి దానికి మించి పెరుగుదల కనిపిస్తోంది. హిట్ టాక్ వస్తే ఇదేమంత కష్టం కాదు. సర్కారు వారి పాట టాక్ తో సంబంధం లేకుండా ఈజీగా వంద కోట్లు రాబట్టుకోవడం చూశాం. ఎఫ్3 చూడొచ్చని ఆడియన్స్ తీర్పు ఇస్తే బ్రేక్ ఈవెన్ దాటడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఏరియాల వారీగా చూస్తే లెక్కలు ఈ విధంగా ఉన్నాయి

నైజామ్ – 22 కోట్ల 50 లక్షలు
సీడెడ్ – 10 కోట్ల 80 లక్షలు
ఈస్ట్ గోదావరి – 5 కోట్లు
వెస్ట్ గోదావరి – 4 కోట్ల 50 లక్షలు
కృష్ణా – 4 కోట్ల 50 లక్షలు
వైజాగ్ – 7 కోట్ల 60 లక్షలు
గుంటూరు – 5 కోట్ల 30 లక్షలు
నెల్లూరు – 2 కోట్ల 40 లక్షలు

ఏపి తెలంగాణ టోటల్ బిజినెస్ – 62 కోట్ల 60 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా – 6 కోట్ల 50 లక్షలు
ఓవర్సీస్ & ఇతరాలు – 10 కోట్ల 50 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం బిజినెస్ – 79 కోట్ల 60 లక్షలు

లాభాల్లోకి ప్రవేశించాలంటే ఎఫ్3 సుమారుగా 82 కోట్ల దాకా షేర్ రాబట్టాల్సి ఉంటుంది. ఇదంతా అంచనా మేరకు ఇచ్చిన ఫిగర్లుగా కనిపిస్తున్నాయి. ఎంత వెంకీ వరుణ్ లు ఉన్నా ఇద్దరికీ ఉన్న మార్కెట్ దృష్ట్యా చూసుకుంటే ఇది భారీ మొత్తమే. అయితే ఆర్ఆర్ఆర్, పుష్ప, కెజిఎఫ్ 2, సర్కారు వారి పాట వసూళ్లు చూశాక పాజిటివ్ టాక్ ఏ మాత్రం వచ్చినా ప్రేక్షకులు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమైపోయింది. మరి ఎఫ్3 ఇంత పెద్ద టార్గెట్ ని ఎలా ఛేదిస్తుందో చూడాలి. ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకోగా ఆశించిన స్థాయిలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మేజిక్ చేయలేకపోయింది. పూజా హెగ్డే ఐటెం సాంగ్ కూడా సోసోగానే వెళ్ళింది. చూడాలి మరి ఏమవుతుందో