ఈ మధ్యకాలంలో థియేటర్స్ లో విడుదలైన సినిమాలు నెల.. రెండు నెలలకే ఓటిటి స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీస్ నుండి లోకల్ మూవీస్ వరకు ఏవైనా నెల లోపే ఓటిటికి వచ్చేస్తున్నాయి. కొన్నిసార్లు కేవలం రెండు మూడు వారాలకు కూడా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ.. కొన్ని సినిమాల విషయంలో మాత్రం ఓటిటి రిలీజ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే.. అన్ని సినిమాలు కొద్దిరోజులకే ఓటిటికి వస్తుంటే.. కొన్ని మాత్రం అసలు రెండు మూడు నెలలు గడిచినా ఎలాంటి కబురు ఉండదు.
ఇటీవల థియేట్రికల్ రిలీజై ఓటిటికి రాని సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో తెలుగు మూవీస్ కూడా ఉండటం గమనార్హం. మరి ఆ సినిమాలేంటి? ఇప్పటిదాకా ఎందుకు ఓటిటి రిలీజ్ కాలేదు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటగా అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్.. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ.. స్పై థ్రిల్లర్ గా తెరపైకి వచ్చింది. ఏప్రిల్ లో విడుదలైన ఈ సినిమా ఓటిటి రైట్స్ సోనీ లివ్ సొంతం చేసుకుంది. కానీ.. ఎందుకు రిలీజ్ చేయలేదో తెలియదు. రెండో మూవీ ‘ది కేరళ స్టోరీ’. చిన్న సినిమాలలో బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాలలో ఇదొకటి. ఈ కేరళలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసినట్లు తెలుస్తుంది. కాగా.. ఇప్పటివరకు ఏ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఏ ఓటిటికి ఇవ్వలేదని సమాచారం.
ఇక మూడో సినిమా రామబాణం. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ తెరకెక్కించిన ఈ సినిమా.. మే నెలలో విడుదలైంది. డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా ఓటిటి రైట్స్ సోనీలివ్ వారు దక్కించుకున్నారు. కానీ.. ఇప్పటిదాకా స్ట్రీమింగ్ చేయలేదు. మరి అందుకు గల కారణమేంటో తెలియాల్సి ఉంది. వీటితో పాటు జర హట్కే జర బచ్కే(జియో సినిమా).. జ్విగాటో లాంటి హిందీ సినిమాలు కూడా ఇంకా డిజిటల్ స్ట్రీమింగ్ కాలేదు. రైట్స్ అమ్మేసినప్పటికీ.. ఎందుకు స్ట్రీమింగ్ చేయట్లేదో తెలియాల్సి ఉంది. మరి థియేటర్స్ లో రిలీజై కూడా ఓటిటికి రాని సినిమాలు మీకు తెలిసినవి ఏమేం ఉన్నాయో కామెంట్స్ లో తెలపండి.